సైరా కలెక్షన్స్ అందుకే డ్రాప్ అయ్యాయి

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ అయినా సైరా నరసింహారెడ్డి మీద బయ్యర్స్ భారీగా ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తంగా రూ.190 కోట్లకు [more]

Update: 2019-10-06 07:22 GMT

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ అయినా సైరా నరసింహారెడ్డి మీద బయ్యర్స్ భారీగా ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తంగా రూ.190 కోట్లకు అమ్మారు. చిరు రీఎంట్రీ మూవీ ఖైదీ 150 కి వచ్చిన కలెక్షన్స్, చిరు క్రేజ్ చూసి బయ్యర్స్ భారీగా ఇన్వెస్ట్ చేసారు. ముందునుండి అనుకుంటున్నట్టు గానే సినిమా కి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. తొలి రోజు భారీగా వసూళ్లు వచ్చాయి. దాంతో బయ్యర్స్ అంత సేఫ్ అని భావించారు.

కానీ రెండు రోజు నుండి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ లో మూడో వంతు కూడా రెండు రోజు రాలేదు. దాంతో ఈసినిమాకి చాలా చోట్ల హౌస్ ఫుల్స్ కూడా లేవు. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రెండు రోజు ఏ షో కి హౌస్ ఫుల్ బోర్డు పడలేదు. కాకపోతే 75 శాతానికి పైగానే థియేటర్లు నిండాయి. కొన్ని షోొలు హౌస్‌ఫుల్‌కు దగ్గరగా వచ్చాయి. రెండు రోజు నుండి కలెక్షన్స్ డ్రాప్ అవ్వడానికి మరో పెద్ద కారణం…హిందీ నుండి వచ్చిన వార్ అండ్ ఇంగ్లీష్ నుండి వచ్చిన జోకర్ మూవీస్. ఈ రెండు మూవీస్ కి వెళ్ళడానికి చాలామంది జనాలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందుకే రెండో రోజు కలెక్షన్స్ తగ్గాయి. మరో కారణం ఈమూవీ బుధవారమే రిలీజైంది. రెండో రోజు గురువారం కాబట్టి వసూళ్లు ఇలా డ్రాప్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. సో శని, ఆదివారాల్లో వసూళ్లు పుంజుకుని హౌస్ ఫుల్స్‌తో సినిమా రన్ అవుతుందని.. షేర్ భారీగా వస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వాళ్ళు.

Tags:    

Similar News