సైరా ని బాహుబలి తో కంపేర్ చేయవద్దు
బాహుబలి సినిమా ఇండియన్ స్టాండర్డ్స్ ని పెంచేసింది. ముఖ్యంగా మన తెలుగు సినిమాల స్థాయిని పెంచేసింది. బాహుబలి ని ఫాలో అవుతూ చిరంజీవి సైరా తో మన [more]
బాహుబలి సినిమా ఇండియన్ స్టాండర్డ్స్ ని పెంచేసింది. ముఖ్యంగా మన తెలుగు సినిమాల స్థాయిని పెంచేసింది. బాహుబలి ని ఫాలో అవుతూ చిరంజీవి సైరా తో మన [more]
బాహుబలి సినిమా ఇండియన్ స్టాండర్డ్స్ ని పెంచేసింది. ముఖ్యంగా మన తెలుగు సినిమాల స్థాయిని పెంచేసింది. బాహుబలి ని ఫాలో అవుతూ చిరంజీవి సైరా తో మన ముందుకు వచ్చాడు. బాహుబలి తలతన్నే విధంగా సైరా ఉండబోతుందని చాలామంది భావించారు కానీ ఈసినిమాను మన తెలుగు ప్రేక్షకులు తప్ప వేరే బాషా వాళ్ళు పెద్దగా ఎంకరేజ్ చేయడంలేదు. చాలామంది ఈసినిమాను ఓన్ చేసుకోలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఈమూవీ బాహుబలి లా ఎక్కడ పెద్దగా వసూళ్లు చేయలేకపోతుంది. దీనికి కారణం కథ, కథనం.
రాజమౌళి బాహుబలి ని తెలివిగా ఓ యూనివర్సల్ సబ్జెక్ట్ గా మార్చేశాడు. మాహిష్మతి అనే ఓ అందమైన ఊహాలోక సామ్రాజ్యాన్ని సృష్టించారు. కానీ సైరా కథ ఏమో తెలుగు రాష్ట్రానికి చెందిన కర్నూలు జిల్లా కథ అని అర్థమైపోతోంది. అందుకే ఈసినిమా కి సౌత్ సినిమాగా ముద్రపడింది. తెలుగు మినహా పక్క రాష్ట్రాల్లో ప్రభావం అంతంతమాత్రంగానే చూపించాడు చిరు.ఈ ప్రభావమే కలెక్షన్లపై పడిందని అంటున్నారు. బాహుబలి అంతలా ఆదరించడానికి కథనం కూడా ఒకటి. ప్రతి 15 నిమిషాలకి ఓ హై-పాయింట్ కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎన్నడు చూడని విధంగా ఉండడంతో బాహుబలి ని ఆదరించారు ప్రేక్షకులు.
మరో మైనస్ పాయింట్ ఏంటంటే చిరంజీవే. అవును ఇందులో చిరు వయసు కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ లో డూప్ ని పెట్టారని అర్ధం అవుతుంది. స్క్రీన్ మీద చిరు చాలా లావుగా కనిపించడం, నరసింహారెడ్డి పాత్రను పుట్టుక నుంచి అనవసరంగా చూపించడం, తమన్నా – చిరు మధ్య లవ్ ట్రాక్ పెట్టాల్సిన అవసరం లేదని వాదించేవాళ్లు చాలామంది. అందుకే ఈమూవీ ని బాహుబలి తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు చాలామంది.