ఫైనల్ గా 50 కోట్ల నష్టమా?
చిరంజీవి ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కించిన సై రా సందడి అణిగిపోయింది. రెండేళ్ల నిరీక్షణకు సై రా మంచి ఫలితమే ఇచ్చింది. మెగా ఫాన్స్ కి [more]
చిరంజీవి ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కించిన సై రా సందడి అణిగిపోయింది. రెండేళ్ల నిరీక్షణకు సై రా మంచి ఫలితమే ఇచ్చింది. మెగా ఫాన్స్ కి [more]
చిరంజీవి ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కించిన సై రా సందడి అణిగిపోయింది. రెండేళ్ల నిరీక్షణకు సై రా మంచి ఫలితమే ఇచ్చింది. మెగా ఫాన్స్ కి మత్రమే కాదు… అందరికి సై రా సినిమా నచ్చింది. కానీ వసూళ్లు చూస్తే కన్నీళ్లు వచ్చేలా కనబడుతుంది. తండ్రి సినిమాల్తో లాభాలు మూట గట్టుకుంటున్న రామ్ చరణ్ కి ఏమోకానీ.. సై రా సినిమాని భారీ రేట్లకి కొనుగోలు చేసిన బయ్యర్ల గగ్గోలు మొదలయ్యాయి. చిరు స్టామినాతో అధిక రేట్లకు కొన్న బయ్యర్లకు ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. అన్ని భాషల్లో కలిపి 200 కోట్లకు పైగానే బిజినెస్ చేసిన సై రా నరసింహారెడ్డికి టోటల్ గా అంటే అన్ని ఏరియాలను కలిపి 50 కోట్ల నష్టాలూ ఖాయంగా కనబడుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్పితే సై రా సినిమా మరే భాషలోనూ సత్తా చాటలేకపోయింది. హిందీ లో మరీ ఘోరం. విడుదలైనప్పటినుండి ఇప్పటివరకు 5.5 కోట్లు అంటే సై రా పరిస్థితి అర్ధమవుతుంది. ఇక తమిళ, మలయాళ, కన్నడలలో కూడా పర్వాలేదనించిన సై రా కి ఇప్పటివరకు 145 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ వారంలోను తెలుగులో మంచి సినిమాలు లేని కారణంగా మహా ఆడితే ఇక్కడ రెండు కోట్లు ఇతర భాషల్లో మరో రెండు కోట్లు కలిపితే… ఓ ఐదు కోట్లు సై రాకు రావొచ్చు. మరి ఓవరాల్ గా సై రా బయ్యర్లకు 50 కోట్ల బ్యాండ్ పడినట్లే. మరిఈ 50 కోట్లని రామ్ చరణ్ రికవరీ చేస్తాడో… తన డాడీ తర్వాత సినిమా అప్పుడు చూద్దామంటాడో చూడాలి.