సీఎం జగన్ తో మరోసారి భేటీకానున్న చిరంజీవి

నిజానికి ఈరోజు ఈ భేటీ జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో 10వ తేదీకి వాయిదా పడింది. జనవరి 13వ తేదీన తాడేపల్లిలోని

Update: 2022-02-08 05:52 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ కానున్నారు. ఫిబ్రవరి 10, గురువారం చిరంజీవి సీఎం జగన్ ను కలవనున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు సినీ ప్రముఖులు కూడా సీఎంతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో మరోసారి రాష్ట్రంలో టికెట్ ధరలతో పాటు, సినీ పరిశ్రమల సమస్యలపై చర్చించనున్నారు.

నిజానికి ఈరోజు ఈ భేటీ జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో 10వ తేదీకి వాయిదా పడింది. జనవరి 13వ తేదీన తాడేపల్లిలోని జగన్ నివాసంలో చిరంజీవి భేటీ అయ్యారు. అప్పుడు ఆయన సింగిల్ గా కలవగా.. ఈ సారి సినీ పెద్దలతో కలిసి భేటీ అవ్వనున్నారు. ఈ నెలాఖరు నుంచి పెద్ద సినిమాలు వరుసగా విడుదలవుతుండటంతో రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్ల విషయంపై మరోసారి చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.


Tags:    

Similar News