Raj Tarun: లావణ్య నుండి అర్ధరాత్రి వచ్చిన మెసేజ్

సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో మరో ఊహించని ఘటన చోటు చేసుకుంది;

Update: 2024-07-13 03:15 GMT

సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో మరో ఊహించని ఘటన చోటు చేసుకుంది. తనను మోసం చేశాడంటూ ఇటీవల లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె శుక్రవారం అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్‌కు మెసేజ్ పంపించింది. తాను వెళ్లిపోతున్నట్టు అందులో పేర్కొంది. వెంటనే స్పందించిన అడ్వకేట్ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ‘‘రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను. బతకలేను. అన్నీ కోల్పోయాను. అందరి వల్ల నేనే మోసపోయాను. రాజ్ తల్లిదండ్రులు కూడా నా చావుకు కారణం. రాజ్ మొత్తం మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. మాల్వీ మల్హోత్రా నా చావుకు ప్రధాన కారణం. నా కుటుంబం, దిలీప్ సుంకర, మీడియాకు నా క్షమాపణలు’’ అంటూ లావణ్య అడ్వకేట్‌కు సందేశం పంపించింది. ఆయన వేగంగా స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తానేంటో తెలిసిన వారే తనను తప్పుబట్టారని లావణ్య వాపోతోంది.

రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్‌తరుణ్‌తో తనకుకు పదేళ్ల క్రితమే పెళ్లయిందని, పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని లావణ్య చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం రాజ్‌తరుణ్‌ నాకు అబార్షన్‌ చేయించాడని ఆరోపించింది. మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా పోలీసులకు అందించానని తెలిపింది.


Similar News