కందికొండ కుటుంబాన్ని ఆదుకుంటాం : మంత్రి తలసాని
మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఎన్నో గొప్ప పాటలను రచించిన కవి కందికొండ మంరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి..
హైదరాబాద్ : సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం కందికొండ మృతదేహాన్ని తెలంగాణ ఫిలిం చాంబర్ లో ఉంచారు. కందికొండ భౌతిక కాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రైటర్ పరుచూరి గోపాలకృష్ణలు అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఎన్నో గొప్ప పాటలను రచించిన కవి కందికొండ మంరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇంతకుముందు చెప్పినట్లే .. కందికొండ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. కాగా.. ఇల్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, పోకిరి, ఠాగూర్ వంటి సినిమాలకు కందికొండ పాటలు రచించారు.