నా భర్త సూపర్ హ్యాండ్సమ్‌!!

ఈమాట అన్నది ఎవరో కాదు.. సమంత. తన భర్త నాగ చైతన్య పిక్ ఒకటి పోస్ట్ చేసిన సమంత నా భర్త చాలా హ్యాండ్సమ్‌ గా ఉన్నాడు [more]

Update: 2020-05-23 08:31 GMT

ఈమాట అన్నది ఎవరో కాదు.. సమంత. తన భర్త నాగ చైతన్య పిక్ ఒకటి పోస్ట్ చేసిన సమంత నా భర్త చాలా హ్యాండ్సమ్‌ గా ఉన్నాడు చూడండి అంటుంది. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలిలో రానా రోక ఫంక్షన్ లో పాల్గొన్న నాగ చైతన్య లు ఆ ఫంక్షన్ కి మెయిన్ హైలెట్ గా నిలిచారు. రానా – మెహిక బజాజ్ ల రోక సెర్మోని… దగ్గుబాటి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా కరోనా లాక్ డౌన్ లో ఇంట్లోనే గడుపుతున్న సామ్ జంట ఈ ఫంక్షన్ లో హడావిడి చేసింది.

అయితే ఈ ఫంక్షన్ లో పాల్గొన్న చైతు పిక్ ఒకటి సోషల్ ఇండియాలో పోస్ట్ చేసిన సమంత నా భర్త చాలా హ్యాండ్సమ్‌గా వున్నాడు చూడండి. నా భర్త ప్రస్తుతం ఎక్కడో ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో దూకేసి ఉంటాడు… అంటూ చేసిన ట్వీట్ తో అక్కినేని భిమానులు అవాక్కవుతున్నారు. చైతు స్టయిల్ బావుంది. కానీ సమంత ఏమిటి గొయ్యి తీసుకుని దూకేస్తాడు అంటుంది అని అనుకుంటున్నారు. ఇక సమంత ఫన్నీగా చేసిన ఈ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన నాగ చైతన్య ఇది ఓ పెయిడ్ పార్ట్నర్ షిప్ లా ఉంది అంటూ కామెడీగా రీ ట్వీట్ చేసాడు. 

Tags:    

Similar News