నభా ని ఓ చూపు చూస్తారేమో?

నన్ను దోచుకుందువటే సినిమాలో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ కి తెలుగులో ఓ అన్నంత ఆఫర్స్ మాత్రం రాలేదు. నన్ను [more]

Update: 2019-07-19 03:48 GMT

నన్ను దోచుకుందువటే సినిమాలో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ కి తెలుగులో ఓ అన్నంత ఆఫర్స్ మాత్రం రాలేదు. నన్ను దోచుకుందువటే సినిమాలో ట్రెషనల్ గా నటించిన నభా మీద పూరి జగన్నాధ్ కన్ను పడింది. రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా ని వన్ అఫ్ ద హీరోయిన్ గా ఎంపిక చేసాడు. పూరి సినిమాల్లో హీరోయిన్స్ కి కూడా మంచి ప్రాధాన్యతే ఉంటుంది. ఈ సినిమాలో నభా కి మంచి పాత్ర నిచ్చాడు పూరి. చాల గ్లామర్ గా అంటే అందాల ఆరబోతలోనే కాదు.. మాస్ గర్ల్ గా నభా నటన ని క్రిటిక్స్ కూడా కొనియాడుతున్నారు.

ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ ను పెద్దగా స్క్రీన్ మీదకు తీసుకురావడానికి పూరికి కుదరలేదు. నిధి గ్లామర్ పరంగా నభా నటాషా తో పోటీపడిన.. నటనకు స్కోప్ లేకుండ పోవడంతో.. నభా రెచ్చిపోయింది. నిధి ని పక్కన బెట్టి పూరి అవసరం అయినపుడల్లా నభా నటేష్ నే నమ్ముకోవాల్సి వచ్చింది. రామ్ తో రొమాంటిక్ సన్నివేశాల్లోను నభా అస్సలు తగ్గలేదు. దర్శకుడు ఎలా చెబితే అలా అందాలు చూపించేసింది. అక్కడక్కడా నభా పాత్రకైతే గ్లామర్ డోసు కాస్త ఎక్కువైంది అని అనిపించకమానదు. గ్లామర్ పరంగా నిధి అగర్వాల్ కి ఏ మాత్రం తీసిపోకుండా నభ అందాలు ఆరబోసింది. కాకపోతే వరంగల్ అమ్మాయిగా నభా పాత్ర ని చూస్తే ఇరిటేట్ అనిపిస్తుంది. తెలంగాణ యాసతో నభా పాత్రకు రాసిన డైలాగులు మరీ కృత్రిమంగా ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందినిగా నభా నటన, ఆమె గ్లామర్ చూసిన యంగ్ హీరోలు ఆమెని ఓ చూపు చూస్తారనిపిస్తుంది.

Tags:    

Similar News