బిగ్ బాస్ యాజమాన్యంపై నాగ్ ఫైర్?

నాగార్జునాన్ హోస్ట్ గా మరి కొద్దీ రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ మా లో మొదలు కాబోతుంది. అయితే తాజాగా నాగార్జున బిగ్ బాస్ [more]

Update: 2020-08-28 04:06 GMT

నాగార్జునాన్ హోస్ట్ గా మరి కొద్దీ రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ మా లో మొదలు కాబోతుంది. అయితే తాజాగా నాగార్జున బిగ్ బాస్ యజమాన్యపై ఫైర్ అయిన విషయం ఇప్పుడు సోషల్ ఇండియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో నిజం ఎంతుందో క్లారిటీ లేదు కానీ… బిగ్ బాస్ యాజమాన్యం చాలా స్లోగా ప్రోమో షూట్స్ అండ్ కంటెస్టెంట్స్ సోలో షూటింగ్ చెయ్యడం పై నాగ్ ఆగ్రహంగా ఉన్నాడనే టాక్ ఫిల్మసర్కిల్స్ లో వినబడుతుంది. ప్రోమోల షూటింగ్, కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లే షూటింగ్ ముగిసి… ఈ  నెలాఖరు నుంచి బిగ్ బాస్ హౌస్ లో షో ప్రారంభం కావాల్సి వుండగా.. ఇప్పుడు అన్నిపనులు లేట్ గా అవుతున్నాయట.

అసలు నిన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఒకరు జెమినీ చానల్ యాంకర్ అరియానా గ్లోరీ హౌస్ లోకి వెళ్లే సీన్ అలాగే యూ ట్యూబర్ మహబూబ్ దిల్ సే పైనా హౌస్ లోకి వెళ్లే సీన్ ను తీయాలని షెడ్యూల్ చేసుకోగా… ఒక జెమిని యాంకర్ అరియానా గ్లోరీ కోసమే ఒక రోజు షూటింగ్ వెచ్చించాల్సి వచ్చిందట. దీంతో మెహబూబ్ ప్రోమో షూటింగ్ ఈరోజుకి వాయిదా పడిందట. మరి ఒక్కరికోసమే ఇలా రోజంతా సమయం కేటాయించాల్సి రావడం ఏంటని నాగ్ బిగ్ బాస్ యాజమాన్యంపై ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ నెలాఖరున మొదలు కావాల్సిన బోగ్ బాస్ షో కాస్తా.. సెప్టెంబర్ 5 కి వాయిదా పడింది అని టాక్.

Tags:    

Similar News