బిగ్ బాస్ టీం కి నాగ్ వార్నింగ్!!

కరోనా తో లేట్ గాను, డల్ గా మొదలైన సీజన్ 4 ని నాగార్జున ఒంటి చేత్తో మోస్తున్నాడు. శని, అది వారాల ఎపిసోడ్స్  నాగ్ పెరఫామెన్స్ [more]

Update: 2020-11-26 06:38 GMT

కరోనా తో లేట్ గాను, డల్ గా మొదలైన సీజన్ 4 ని నాగార్జున ఒంటి చేత్తో మోస్తున్నాడు. శని, అది వారాల ఎపిసోడ్స్ నాగ్ పెరఫామెన్స్ తో స్టార్ మా కి మంచి టి ఆర్పీ వస్తుంది. అంతఅంట చేస్తున్న నాగ్ కి బిగ్ బాస్ టీం లీకులతో షాకిస్తుంది. బిగ్ బాస్ లీకులతో నాగార్జున విసిపోయాడట. బిగ్ బాస్ లీకులు మాములుగా లేవు. ఆదివారం ఏ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారో అనే విషయం శనివారం లీకవడం, అలాగే హౌస్లో జరిగే విషయాలతోను నాగ్ కి కోపం వచ్చింది అని.. బిగ్ బాస్ యాజమాన్యంపై నాగ్ ఫైర్ కూడా అయ్యాడనే టాక్ నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 ముగుస్తున్న బిగ్ బాస్ లీకులు ఆగడం లేదని.. ఈ విషయంలో నాగ్ చాలా చిరాకుగా ఉన్నాడని అంటున్నారు.

సీజన్ స్టార్ట్ అయినప్పటినుండి స్టిల్ ఇప్పటివరకు లీకుల పరంపర సాగుతూనే ఉంది. సీజన్ చివరి వరకు ఇదే కంటిన్యూ..అయితే నెక్స్ట్ సీజన్ తాను హోస్ట్ చెయ్యనని మోహమాటం లేకుండా నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ ని సీక్రెట్ గా ఉంచాల్సింది పోయి.. ఇలా లీకులు వదిలితే షో మీద ఏం క్రేజ్ ఉంటుంది.. నేను ఇంతా కష్టపడి షో ని లేపాలని ట్రై చేసినా ఉపయోగం ఉండదు అంటూ బిగ్ బాస్ యాజమాన్యంపై నాగార్జున ఫైర్ అవుతున్నాడట. ఇప్పటికైనా బిగ్ బాస్ యాజమాన్యం సీరియస్ గా ఉంటేనే కానీ లేదంటే కష్టమని చెప్పేశాడట నాగ్.

Tags:    

Similar News