మజిలీతో చైతూ అక్కడికి..!

ఈ ఏడాది మొదట్లో విడుదలైన ఎఫ్ 2 సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. కామెడీ కంటెంట్ కి ప్రేక్షకులు పడిపోవడంతో ఎఫ్ [more]

Update: 2019-04-09 07:15 GMT

ఈ ఏడాది మొదట్లో విడుదలైన ఎఫ్ 2 సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. కామెడీ కంటెంట్ కి ప్రేక్షకులు పడిపోవడంతో ఎఫ్ 2 అదరగొట్టే హిట్ అయ్యింది. ఇక మళ్లీ ఆ రేంజ్ హిట్ ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన మజిలీ కొట్టేలాగే కనబడుతుంది. చైతు – సామ్ జంటగా శివ నిర్వాణ తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనెర్ మజిలీ గత శుక్రవారం విడుదలై అదరగొట్టే కలెక్షన్స్ తో బాక్సాఫీసుని దున్నేస్తుంది. పిల్లలకి హాలిడేస్ ఉండటంతో కరెక్ట్ టైంకి థియేటర్స్ లోకి దిగిన మజిలీ సినిమా అద్భుతమైన హిట్ అందుకుంది.

కెరీర్ లోనే బిగ్గెస్ట్ షేర్స్

కేవలం నాలుగు రోజుల్లోనే మజిలీకి పెట్టిన పెట్టుబడి వచ్చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది అంటే మజిలీ ఏ రేంజ్ హిట్టో అర్ధమవుతుంది. మజిలీ సినిమాకి థియేట్రికల్ హక్కులకు 21 కోట్లు వచ్చాయి. మరి ఆ ఫిగర్ ని మజిలీ కేవలం నాలుగు రోజులకే అందుకుంది. మొదటి రోజే 7 కోట్లకు పైగా షేర్ సాధించి.. చైతూ కెరీర్లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. వీకెండ్ పూర్తయ్యే సరికి మజిలీ 17.5 కోట్ల దాకా షేర్‌ రాబట్టడం విశేషం. ఫస్ట్ వీకెండ్ లో చైతూకిదే బిగ్గెస్ట్ షేర్ సాధించిన చిత్రం కావడం విశేషమే. శని, ఆదివారాల్లో మజిలీ కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వలేదు.

నేటి నుంచి ఇక లాభాలే…

ఇక నిన్న కూడా మజిలీ బుకింగ్స్ బాగుండడంతోనే నాలుగు రోజులకే మజిలీ బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. మరి సోమవారం పూర్తయ్యే సరికి మజిలీకి పెట్టిన పెట్టుబడి వచ్చేస్తే.. ఈరోజు వచ్చే కలెక్షన్స్ మజిలీ నిర్మాతలకు లాభాలే లాభాలు. మజిలీ సినిమా లాంగ్ రన్ లో 35 కోట్ల క్లబ్బులో చేరనుంది. చైతు కెరీర్ లో ఈ ఫిగర్ హైయ్యెస్ట్. మరి చైతు 35 కోట్ల క్లబ్బులో మజిలీ తో కాలు పెడతాడో లేదో చూడాలి.

Tags:    

Similar News