నాగ శౌర్య డాక్టర్స్ మాట లెక్క చేయడంలేదు

నాగ శౌర్య ఛలో సినిమాతో డీసెంట్ హిట్ అందుకుని తన సొంత బ్యానర్ అయినా ఐరా క్రియోష‌న్స్ లో కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో ఓ [more]

Update: 2019-07-04 09:47 GMT

నాగ శౌర్య ఛలో సినిమాతో డీసెంట్ హిట్ అందుకుని తన సొంత బ్యానర్ అయినా ఐరా క్రియోష‌న్స్ లో కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం యొక్క రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరో నాగ శౌర్య ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాలికి బలమైన గాయం కావడం వలన డాక్టర్స్ ఆయనను నెల పైనే రెస్ట్ తీసుకోవా లని కోరారు. కానీ నాగ శౌర్య నెల పూర్తవ్వకుండానే షూటింగ్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యిపోయాడు.

ఈనెల మూడో వారం నుండి ఆగిపోయిన రెండో షెడ్యూల్ షూటింగ్ వెళ్లనున్నారు శౌర్య. ఇది వైజాగ్ లో జరగనుంది. అవుట్ ఫుట్ విషయంలో నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఇక ఈసినిమాలో ఎఫ్ 2 బ్యూటీ మెహరీన్. ఎఫ్ 2 తరువాత ఆమె చేస్తున్న చిత్రం ఇదే కావడం విషయం. ఇక ఈమూవీ పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు నటించగా…శ్రీ‌చ‌ర‌ణ్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Tags:    

Similar News