నాగబాబు అక్కసు తీరలేదు

నాగబాబు జబర్దస్త్ ని వదిలి అదిరింది అంటూ జీ ఛానల్ కి వచ్చేసాడు. జబర్దస్త్ ని వదిలినపుడు… ఆ షో ని పొగుడుతూనే మల్లెమాల వాళ్ళని విమర్శించాడు. [more]

Update: 2019-12-24 08:02 GMT

నాగబాబు జబర్దస్త్ ని వదిలి అదిరింది అంటూ జీ ఛానల్ కి వచ్చేసాడు. జబర్దస్త్ ని వదిలినపుడు… ఆ షో ని పొగుడుతూనే మల్లెమాల వాళ్ళని విమర్శించాడు. మల్లెమాల క్రియేటివ్ మైండ్స్ ఉన్నవాళ్ళని తొక్కేస్తుంది అంటూ సంచలన విషయాలు మాట్లాడాడు. నితిన్, భరత్ టాలెంట్ ని మల్లెమాల తొక్కేసింది అంటూ మట్లాడిన నాగబాబు అదిరింది ప్రోగ్రాం కోసం భారీ ప్రమోషన్స్ చేసాడు. సీనియర్ కమెడియన్స్ ధనరాజ్, వేణు, ఆర్పీ, చమ్మక్ చంద్ర లతో కలిసి అదిరింది ప్రోగ్రాం కోసం జేడ్జ్ గా మారిన నాగబాబు ఆదివారం ప్రసారమైన షో లో ఇరగదీసాడు. ఇక అదిరినది ప్రోగ్రాం జబర్దస్త్ సీక్వెల్ గా ఉందనే విమర్శలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా నాగబాబు మరోసారి మల్లెమాల పై విరుచుకుపడ్డాడు. అదేమిటంటే.. అదిరింది ప్రోగ్రాం ని ఆదివారం నైట్ జీ ఛానల్ లో ప్రసారమైన టైం లోనే ఈ టివిలో జబర్దస్త్ పాత స్కిట్స్ ని మల్లెమాల ప్రసారం చేయడంపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసాడు. తాము జబర్దస్త్ కి పోటీ వెళ్లకూడదని. గురు, శుక్రవారం వదిలేసి ఆదివారం నైట్ పెట్టుకుంటే.. అప్పుడు కూడా జబర్దస్త్ షో ని ప్రసారం చెయ్యడం ఏమిటి… నితిన్, భరత్ షో లని ప్లాప్ చెయ్యాలని మల్లెమాల కంకణం కట్టుకుంది అంటూ… అదిరింది టైం లో జబర్దస్త్ రావడం చూసి షాకయినట్లుగా చెబుతున్నాడు నాగబాబు

Tags:    

Similar News