బాబు మహిమ పాత బ్యాచ్ మొత్తం బయటికొచ్చింది!

నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు అది పాత కథ. ఇక రోజా జేడ్జ్ గా జబర్దస్త్ ఈ వారం నుండి కొత్తగా ఉండబోతుంది. అయితే జబర్దస్త్ కమెడియన్స్ [more]

Update: 2019-11-29 06:10 GMT

నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు అది పాత కథ. ఇక రోజా జేడ్జ్ గా జబర్దస్త్ ఈ వారం నుండి కొత్తగా ఉండబోతుంది. అయితే జబర్దస్త్ కమెడియన్స్ అంతా నాగబాబు తో వెళ్ళిపోతారనుకున్నారు. కానీ నాగబాబు దారి నాగబాబు ని చూసుకోమన్నారు కానీ జబర్దస్త్ ని ఏ ఒక్క కమెడియన్ వీడలేదు. చమ్మక్ చంద్ర ల్నాటి వాళ్ళు తప్ప. అయితే జబర్దస్త్ కమెడియన్స్ ని తనతో తీసుకెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేసిన నాగబాబు కి ఎదురు దెబ్బ తగలడంతో… నాగబాబు పాత బ్యాచ్ ని బయటికి లాగాడు. జబర్దస్త్ మొదలైనప్పుడు వేణు, ధనరాజ్ లాంటి వాళ్ళు కామెడీ తో అదరగొట్టిన బ్యాచ్.

అయితే వేణు, ధనరాజ్ లాంటి కమెడియన్స్ కి వెండితెర మీద మంచి అవకాశాలు రావడంతో… జబర్దస్త్ నుండి తప్పుకోవడం హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు టాప్ మోస్ట్ కమెడియన్స్ గా జబర్దస్త్ లో పాతుకుపోవడంతో… వెండితెర మీద అవకాశాలు తగ్గిన ధనరాజ్ కి వేణుకి జబర్దస్త్ నుండి పిలుపురాకపోవడంతో… వారు ఖాళీగానే ఉన్నారు. అయితే తాజాగా నాగబాబు జీ ఛానల్ లోకి జడ్జ్ గా వెళ్లడంతో… నాగబాబు తో పాటుగా వేణు, ధనరాజ్ లు మళ్ళీ పూర్వ వైభవం కోసం కామెడీ స్కిట్స్ తో జీ తెలుగు ఛానల్ కి లోకల్ గ్యాంగ్స్ లాంటి ప్రోగ్రామ్స్ తో అలరించడానికి తయారయ్యారు. మరి నాగబాబు పుణ్యమా అని మళ్ళీ పాత బ్యాచ్ మొత్తం బయటికి అలా వచ్చిందన్నమాట

Tags:    

Similar News