జబర్దస్త్ నుంచి వారు తప్పుకున్నారు
ప్రతి గురువారం, శుక్రవారం ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో వేరే చెప్పనవసరం లేదు. ఈ రెండు రోజులకి [more]
ప్రతి గురువారం, శుక్రవారం ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో వేరే చెప్పనవసరం లేదు. ఈ రెండు రోజులకి [more]
ప్రతి గురువారం, శుక్రవారం ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో వేరే చెప్పనవసరం లేదు. ఈ రెండు రోజులకి వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ మరే ప్రోగ్రాం కి రాదు. అంతలా క్లిక్ అయిన ఈ షో నుంచి కీలకమైన క్రియేటివ్ హెడ్స్ నితిన్-భరత్ ఆ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలానే పోరా పోవే కొనసాగింపు విషయంలో మల్లెమాల యూనిట్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా వారిద్దరూ ఈటీవీ నుండి తప్పుకున్నారు.
నాగబాబు ఆఫర్…..
మరో వైపు జబర్దస్త్ హోస్ట్ నాగ బాబు ఈ షో పై ప్రేత్యేకైమైన శ్రద్ద పెట్టినట్టు తెలుస్తుంది. జబర్దస్త్ లో బాగా లావుగా వున్న ఇద్దరు ముగ్గురు నటులకు అర్జెంట్ వెయిట్ లాస్ కావాలని…అలా వాళ్ళు లావు తగ్గితే యాభై వేలు గిఫ్ట్ ఇస్తానని నాగబాబు ఆఫర్ పెట్టాడట. ఈ షో స్కిట్ లు, వాటి క్వాలిటీ, నటుల ఫిజిక్ ఇవన్నీ కూడా ఇప్పుడు బేరీజు వేస్తూ, జబర్దస్త్ స్థాయిని పెంచే దిశగా నాగబాబు ప్రయత్నిస్తున్నారట. కానీ నితిన్-భరత్ లు సడన్ గా ఆ కార్యక్రమం నుండి తప్పుకోవడంతో ఇప్పుడు షో ఎలా రన్ చేస్తారో చూడాలి.