కాన్సెప్ట్ నచ్చలేదంటూనే… వారానికి 12 దొబ్బుతున్నాడా?

నాగార్జున గతంలో బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. బిగ్ బాస్ వన్ కి ఎన్టీఆర్, టు కి నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఎన్టీఆర్ [more]

Update: 2019-07-05 03:19 GMT

నాగార్జున గతంలో బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. బిగ్ బాస్ వన్ కి ఎన్టీఆర్, టు కి నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఎన్టీఆర్ బిగ్ బాస్ హోస్ట్ గా చేసినప్పుడు చాలా సాలిడ్ గా సాగిన ఈ షో.. నాని హోస్ట్ చేసినప్పుడు అనేక సమస్యలు చుట్టుముట్టాయి. అందుకే బిగ్ బాస్ 3 ని హోస్ట్ చెయ్యడానికి ఏ హీరో కూడా సాహసం చెయ్యలేదు. చివరికి మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ప్రేక్షకులను మాయ చేసిన మన్మధుడు నాగార్జున బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా చెయ్యడానికి రెడీ అయ్యాడు. అప్పట్లో అలా ఘాటైన వ్యాఖ్యలు చేసిన నాగార్జున ఇప్పుడు ఈ షో హోస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో మాములుగా ట్రోలింగ్ జరగలేదు.

అయితే నాగార్జున ఈ షో కి ఒప్పుకోవడానికి స్టార్ మా యాజమాన్యం ఆఫర్ చేసిన భారీ పారితోషకమే కారణమంటున్నారు. నాగార్జునకు ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ.12 లక్షలు ఆఫర్ చేసినట్లు సమాచారం. మరి ఎన్టీఆర్, నాని అంత కాకపోయినా నాగార్జునకు భారీ మొత్తం ముట్టచెప్పడానికి స్టార్ మా యాజమాన్యం రెడీ అయ్యారని చెబుతున్నారు. అయితే గతంలో నాగ్ మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక్కో ఎపిసోడ్ కి దాదాపుగా 7 లక్షలు ఛార్జ్ చేసేవాడట. మరి ఇప్పుడు బిగ్ బాస్ కోసం మరో ఐదు లక్షలు అదనంగా వస్తున్నాయ్. అందుకే ఒక్కో ఎపిసోడ్ కి 12 లక్షలు నాగార్జున వసూలు చేస్తున్నాడు. అయితే అప్పట్లో బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చలేదని చెప్పిన నాగార్జున ఇప్పుడు 12 లక్షలకు పడిపోయాడంటూ కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News