ఎన్టీఆర్ ని బ్రతిమాలటం ఎందుకు.. నాగ్ ఉన్నాడుగా?

ఎన్టీఆర్ ప్రస్తుతం RRR షూటింగ్ తో పాటుగా త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చెయ్యబోయే కొత్త సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్ళిపోతాడు. సో ఎన్టీఆర్ [more]

Update: 2020-03-14 17:48 GMT

ఎన్టీఆర్ ప్రస్తుతం RRR షూటింగ్ తో పాటుగా త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చెయ్యబోయే కొత్త సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్ళిపోతాడు. సో ఎన్టీఆర్ వచ్చే ఏడు ఏప్రిల్ వరకు బాగా బిజీ. అందుకే ఈసారి ఎన్టీఆర్ ని బిగ్ బాస్ హోస్టింగ్ చెయ్యమని స్టార్ మా యాజమాన్యం ఆడగదట. ఇంత బిజీగా వున్నా ఎన్టీఆర్ ని బ్రతిమిలాడి కన్విన్స్ చేసి కోట్లు వదిలించుకోవడం ఎందుకులే అని స్టార్ మా మరో హీరో కోసం ప్రయత్నాలు మొదలెట్టిందట. ముందైతే ఎన్టీఆర్ హోస్ట్ అయితే సీజన్ 4 కి బావుంటుంది… ఎంతైనా ఇద్దామనుకున్నారు. కానీ తాజాగా స్టార్ మా ఎన్టీఆర్ పై ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.

ఈసారి 4 వ సీజన్ కి మహేష్ ని కూడా అనుకున్నారట కానీ… మహేష్ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదట. అయితే సీజన్ 3 ని చక్కగా నడిపించిన నాగ్ తోనే సీజన్ 4 ప్లాన్ చేస్తుందట స్టార్ మా. బిగ్ బాస్ సీజన 4 కోసం నాగార్జున ని సంప్రదించినట్లుగా వార్తలొస్తున్నాయి. సీజన్ 3 తో పోలిస్తే సీజన్ 4 కి డబుల్ రెమ్యునరేషన్ ఇస్తామని నాగ్ ని స్టార్ మా బిగ్ బాస్ యాజమాన్యం కన్విన్స్ చేసిందట. యంగ్ హీరోలు ఎవరిని కదిపినా.. వారు బిజీ గా ఉంటారు కాబట్టి.. నాగ్ అయితే ఎలాంటి గొడవ కానీ టెన్షన్ కానీ ఉండదని. చివరికి నాగ్ కే స్టార్ మా ఫిక్స్ అయ్యింది అని తెలుస్తుంది.

Tags:    

Similar News