మంచి రోజులు వచ్చేనా ?

అక్కినేని నాగార్జునకి గత ఏడాది అంతగా కలిసి రాలేదు. అయితే ఈ ఏడాది తనకు కచ్చితంగా కలిసొస్తుందని రెండు సినిమాలతో మన ముందుకు వస్తున్నాడు. గత ఏడాది [more]

Update: 2019-01-02 07:42 GMT

అక్కినేని నాగార్జునకి గత ఏడాది అంతగా కలిసి రాలేదు. అయితే ఈ ఏడాది తనకు కచ్చితంగా కలిసొస్తుందని రెండు సినిమాలతో మన ముందుకు వస్తున్నాడు. గత ఏడాది సుశాంత్ హీరోగా తెరకెక్కిన “ఛి. లా.సౌ” సినిమాను డైరెక్ట్ చేసి మంచి హిట్ అందుకున్న హీరో రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు నాగార్జున ను డైరెక్ట్ చేయనున్నాడు. నాగ్ కెరీర్ లో మంచి హిట్ అందుకున్న ‘మన్మధుడు’ కి సీక్వెల్ గా ఈమూవీ రానుంది.

“మన్మధుడు 2” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగ్ నటిస్తున్నాడు. హీరోయిన్స్ ఎవరు? ఇతర నటీనటులు ఎవరు? అనేది త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం రాహుల్ ఆ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వచ్చే నెల ఫిబ్రవరి నుండి షూటింగ్ స్టార్ట్ చేసి మే లేదా జూన్ లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు మేకర్స్.

మరోపక్క తన కెరీర్ లో నే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “సోగ్గాడే చిన్ని నాయన” సినిమా కి సీక్వెల్ గా “బంగార్రాజు” సినిమా రాబోతుంది. దీన్ని కూడా కళ్యాణ్ కృష్ణే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో నాగ చైతన్య ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. కొంచెం పెద్ద బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యి దసరాకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అలా రెండు సినిమాలని లైన్ లో పెట్టాడు నాగార్జున. సో ఈ ఏడాది నాగ్ ఫ్యాన్స్ ఇంతకు మించి ఏమి కావాలి.

Tags:    

Similar News