పేరు లేకుండానే రచ్చ చేశారే!!

బాలీవుడ్ డ్రగ్స్ కేసు కాస్తా టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ ఎన్ సీబీ ఎదుట విచారణకు [more]

Update: 2020-09-28 16:22 GMT

బాలీవుడ్ డ్రగ్స్ కేసు కాస్తా టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ ఎన్ సీబీ ఎదుట విచారణకు హాజరవడమే కాదు.. తానేమి తప్పు చేయలేదని.. తన ఫ్రెండ్ రియా చక్రవర్తి తన దగ్గర డ్రగ్స్ దాచుకుంది అని చెప్పింది. మరి డ్రగ్స్ దాచుకుంది అంటే.. రకుల్ తెలిసి రియాకి సహకరించినట్టే. రియా రకుల్ ని ఇరికిస్తే.. రకుల్ రియా ని ఇరికించినట్టుగా అయ్యింది. అదలా ఉంటే.. బాలీవుడ్ హీరోయిన్స్ సారా అలీఖాన్, దీపికా, శ్రద్ద కపూర్ లకు ఎన్ సీబీ సమన్లు జారీ చెయ్యడమే కాకుండా ఈ డ్రగ్స్ కేసులో మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ పేరు ఉన్నట్టుగా నేషనల్ మీడియాలో ప్రసారం కావడంతో.. సౌత్ మీడియా కూడా నమ్రత విషయంలో అనుమానాలు వ్యక్తం చేసింది.

అంటే ఈకేసులో నమ్రత కూడా ఇన్వాల్వ్ అయ్యిందా? అలాగే నమ్రత ఆడియో టేపులని మీడియాలో ప్రచారం చేసాయి ఛానల్స్. అయితే గత రెండు రోజులుగా దీపికా విచారణ, శ్రద్ద, సారా, రకుల్ విచారణ అంటూ ఎంసీబీ ఎంక్వైరీ చేస్తున్నా.. ఎక్కడా నమ్రత పేరు బయటికి రాలేదు. అసలు ఈ కేసులో తమకు సంబంధం లేదని, అనవసరంగా తమని బద్నామ్ చేస్తున్నారని కానీ నమ్రత ఎక్కడా స్పందించలేదు. అలా హుందాగా ఉండడమే ఇప్పుడు వాళ్లకు కలిసొచ్చింది. నమ్రత అనవరసరంగా రంగంలోకి దిగి ఈ కేసు విషయంలో స్పందిస్తే తర్వాత.. వాళ్ళ పేరు ఎన్ సీబీ బయటపెట్టకపోతే పెంట పెంట అయ్యేది. ఎలాగూ ఎన్ సీబీ నమ్రత పేరు చెప్పలేదు. ఇక జాతీయ మీడియాలోనూ నమ్రత పేరు బయటికి రాకపోయేసరికి ఇక డ్రగ్స్ కేసులో నమ్రత లేదని అందరూ ఫిక్స్ అవుతున్నారు.

Tags:    

Similar News