నమ్రత ఏం చేయబోతుంది?

మహేష్ బాబు భార్య నమ్రత కొంతకాలం నుండి మహేష్ సినిమాల విషయంలోనూ, మహేష్ బిజినెస్ ల విషయంలోనూ ఓ టీం ని పెట్టుకుని మరీ పబ్లసిటీ విషయాలను [more]

Update: 2020-03-08 06:40 GMT

మహేష్ బాబు భార్య నమ్రత కొంతకాలం నుండి మహేష్ సినిమాల విషయంలోనూ, మహేష్ బిజినెస్ ల విషయంలోనూ ఓ టీం ని పెట్టుకుని మరీ పబ్లసిటీ విషయాలను పర్ఫెక్ట్ గా మైంటైన్ చేస్తుంది. మెహర్ రమేష్ లాంటోళ్ళు నమ్రత వెనకాలే ఉంటూ నమ్రత చెప్పినవి చెప్పినట్టుగా ఆచరణలో పెడుతున్నట్టుగా ప్రచారం ఉంది. అయితే నమ్రత మహేష్ స్టోరీ సిట్టింగ్ లోను పార్టిసిపేట్ చేస్తుంది అని.. గతంలోలా మహేష్ కేవలం పిఆర్ టీమ్ నే నమ్ముకోవడం లేదని.. సొంత మనుషులు గా మహేష్ కి నీడలా ఉండే వాళ్ళు మహేష్ కి హెల్ప్ చేస్తున్నట్లుగా ఫిలింనగర్ గుసగుసలు. స్పైడర్ సినిమా అప్పటినుండి నమ్రత మహేష్ విషయంలో తెగ జాగ్రత్తలు తీసుకుంటుంది అని అంటున్నారు. ప్రస్తుతం కూడా నమ్రత మహేష్ విషయంలో చాలా యాక్టీవ్ గా తన టీమ్ తో కలిసి పనిచేస్తుంది అని… సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ సినిమా విషయం ఇంకా సందిగ్ధంలో ఉండడం, వంశి పైడిపల్లి తో సినిమా ఆగిపోవడంతో మీడియాలో రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి.

అందులో కొన్ని గాసిప్స్ ఉన్నాయి.. కొన్ని నిజాలు ఉన్నాయి. అయితే నమ్రత ఇప్పుడు మహేష్ మీద కొన్ని వెబ్ సైట్స్, సోషల్ మీడియా లో వస్తున్నా నెగెటివ్ న్యూస్ ల మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఏ వెబ్ సైట్ లో అయినా, లేదంటే ఫేస్ బుక్ లో అయినా మహేష్ మీద నెగెటివ్ న్యూస్ పడగానే నమ్రత రంగంలోకి దిగి తన టీం తో వారికీ ఫోన్స్ చేయించి ఆ న్యూస్ లను డిలేట్ చేయించే ప్రోగ్రాం పెట్టుకుంది. పలు వెబ్ సైట్స్ మహేష్ ని పాజిటివ్ గా ప్రమోట్ చేస్తూ.. మహేష్ టీం ని సంతోషపరుస్తున్నారని.. కానీ అప్ప్పుడప్పుడు మహేష్ మీద నెగెటివ్ ఆర్టికల్స్ పడుతుంటే మాత్రం వెంటనే ఫోన్ వస్తుందట. మరి మహేష్ ప్రస్తుతం ఎలాంటి సినిమా ఒప్పుకోకుండా ఉండంతో నమ్రత ఇలా చేస్తుంది. మహేష్ నెక్స్ట్ సినిమా ఓకె అవ్వగానే ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేయించాలి అనేది నమ్రత తన టీం కి ముందునుండే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందట.

Tags:    

Similar News