బాలయ్య న్యూ లుక్ టెస్ట్

జై సింహ లాంటి హిట్ కాంబినేషన్ తరువాత మళ్లీ బాలయ్య రూలర్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక [more]

Update: 2019-10-20 11:28 GMT

జై సింహ లాంటి హిట్ కాంబినేషన్ తరువాత మళ్లీ బాలయ్య రూలర్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈమూవీ డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ చుస్తునారు. ఇది ఇలా ఉంటె బాలయ్య నెక్స్ట్ బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్నాడు అని తెలిసిన విషయమే. ఈసినిమా కోసం బాలయ్య చాల హార్డ్ వర్క్ చేస్తున్నారట.

సినిమా విషయంలో బాలయ్య డెడికేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే బోయపాటి తన సినిమా కోసం బాలయ్య ను వెయిట్ తగ్గమని చెప్పడంతో ఆయన ప్రతిరోజు గంటలబడి వర్కవుట్స్ చేస్తున్నారట. ప్రత్యేకంగా ఫిట్నెస్ నిపుణుడ్ని నియమించుకుని డైట్ కంట్రోల్ పాటిస్తున్నారు.ప్రస్తుతం బాలయ్య కు 10 కిలోల వరకు తగ్గాలనేది టార్గెట్. ఇక ఇందులో బాలయ్య లుక్ పూర్తిగా భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బోయపాటి.

ఇందుకోసం బోయపాటి డిసెంబర్ లో బాలయ్య కు లుక్ టెస్ట్ చేయనున్నాడు. అన్ని ఓకే అనుకుంటే జనవరి నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఇక ఈమూవీని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు.

Tags:    

Similar News