Mohan babu : మోహన్ బాబు ఆ మాట అడగలేదే?

అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే లో నందమూరి బాలకృష్ణ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబుతో ఇంటర్వ్యూ సందర్భంగా టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ తర్వాత ఎందుకు [more]

Update: 2021-11-05 03:47 GMT

అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే లో నందమూరి బాలకృష్ణ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబుతో ఇంటర్వ్యూ సందర్భంగా టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ తర్వాత ఎందుకు చేపట్టలేదని అడిగారు. అందుకు బాలయ్య సమాధానమిస్తూ అప్పట్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటూ వారసత్వ రాజకీయాలు నడిచేవని, వారసత్వ రాజకీయాలను విమర్శించే మనమే పార్టీ పగ్గాలు చేపడితే బాగుండదని తీసుకోలేదన్నారు.

లోకేష్ విషయంపై….?

ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబుకు ఎందుకు మద్దతిచ్చారని అన్న మోహన్ బాబు ప్రశ్నకు ఆయన అనుభవం, రాజకీయాలను ఆకళింపు చేసుకున్న విధానం తనకు నచ్చిందన్నారు. అయితే మోహన్ బాబు ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు వారసుడిగా లోకేష్ ఎందుకని అనుకంుటున్నారన్న ప్రశ్న అడగలేదు. బాలయ్య సమాధానం చెప్పలేదు. రాజకీయాలపై తనకున్న అభిప్రాయాన్ని బాలకృష్ణ కుండబద్దలు కొట్టారు.

Tags:    

Similar News