బిగ్ బాస్ కి వెళుతున్నట్టుగా కన్ఫర్మ్ చేస్తున్నారుగా!!

బిగ్ బాస్ సీజన్ 4 త్వరలోనే స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. ఇప్పటికే విడుదలైన నాగార్జున బిగ్ బాస్ ప్రోమో తో ఈ షో మీద [more]

Update: 2020-08-26 04:42 GMT

బిగ్ బాస్ సీజన్ 4 త్వరలోనే స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. ఇప్పటికే విడుదలైన నాగార్జున బిగ్ బాస్ ప్రోమో తో ఈ షో మీద మరింత ఆసక్తి బుల్లితెర ప్రేక్షకుల్లో పెరిగింది. ఇప్పటికే బిగ్ బాస్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ని కరోనా టెస్ట్ లు చేసి హోమ్ క్వారంటైన్ లో ఉంచినట్లుగా వార్తలొస్తుంటే… షో లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ విషయంలో సోషల్ మీడియాలో చాలా పేర్లు ప్రచారం లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా సురేఖ వాణి, నటుడు నందు, రఘు మాస్టర్ -ప్రణవి జంట, అలాగే మహాతల్లి ఆమె భర్త సుశాంత్, హెచ్ఎం టివి యాంకర్ సుజాత, కరాటే కళ్యాణి, లాస్య, నోయల్, జబర్దస్త్ అవినాష్, యాంకర్ ప్రశాంతిల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 4 స్టార్టింగ్ డే వరకు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ వివరాలు బయట పెట్టరు బిగ్ బాస్ యాజమాన్యం.

కానీ ఇప్పుడు ఓ కంటెస్టెంట్ తాను బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్ళబోతున్నట్టుగా సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసాడు. అతనే సీజన్ 2 లో పాల్గొన్న సింగర్ గీత మాధురి భర్త నందు. తాజాగా నందు ఇన్స్టా లో డార్లింగ్స్ నేను బిగ్ బాస్ లో పాల్గొంటున్నాను. అక్కడ మన రచ్చ మాములుగా ఉండదు. మరింత ఎంటరైన్మెంట్ తో మీ ముందుకు వస్తాము.. మీ సహాయం కావాలి.. మరో అప్ డేట్ తో మంగళవారం మీ ముందుకు వస్తాం అంటూ కన్ఫర్మ్ చేసాడు. ఇక సురేఖావాణి కూతురు కూడా క్లారిటీ ఇవ్వకుండానే అమ్మ సురేఖ వాణి కూడా బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నట్టుగా చెబుతుంది. తాజాగా సురేఖ వాణి కూతురు మాట్లాడుతూ తన తల్లి తనకి బిగ్ బాస్ కి వెళుతున్నట్టుగా తనకి చెప్పలేదని.. అంటుంది. కానీ అమ్మ బిగ్ బాస్ కి వెళ్లడం ఏమిటి అంటూ ఖండించలేదు. అలాగే వెళ్లడం లేదని చెప్పలేదు. అంటే సురేఖ వాణి కూడా బిగ్ బాస్ సీజన్ 4 లో కనిపించడం ఖాయమే.

Tags:    

Similar News