జెర్సీకి నాని రెమ్యూనరేషన్ తగ్గించాడు..!

కృష్ణార్జున యుద్ధం సినిమాకి నాని 11 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే తన రెమ్యూనరేషన్ ను పెంచేసేవాడు. కానీ అది [more]

Update: 2019-02-10 08:15 GMT

కృష్ణార్జున యుద్ధం సినిమాకి నాని 11 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే తన రెమ్యూనరేషన్ ను పెంచేసేవాడు. కానీ అది జరగలేదు. ప్రస్తుతం నాని చేస్తున్న జెర్సీ సినిమా కోసం కోటి రూపాయలు తగ్గించి 10 కోట్ల రూపాయల పారితోష‌కం మాత్రమే తీసుకున్నాడట. గత కొన్ని సినిమాల నుండి నాని మార్కెట్ పరంగా కూడా స్లోగా తగ్గుతూ వస్తున్నాడు కాబట్టి ప్రొడ్యూసర్స్ ని దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాడు.

హిట్ అయితే ఒకే…

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా హిట్ అయితే నానికి కొంతమేర అదనపు డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బ్యానర్ వారు హీరోలని బాగా చూసుకుంటారు అనే పేరు ఉంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రీసెంట్ గా జీ తెలుగు ఛానెల్ వారు దక్కించుకున్నారు. శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Tags:    

Similar News