నవీన్ పోలిశెట్టి కి గోల్డెన్ ఛాన్స్

ఈమధ్య కాలంలో ఎటువంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా వచ్చి సూపర్ హిట్ కొట్టిన చిన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఇందులో [more]

Update: 2019-08-05 09:00 GMT

ఈమధ్య కాలంలో ఎటువంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా వచ్చి సూపర్ హిట్ కొట్టిన చిన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఇందులో హీరోగా నటించిన నవీన్ పోలిశెట్టికి వచ్చిన గుర్తింపు చిన్నదేమి కాదు. ముఖ్యంగా ఇతని యాక్టింగ్ గురించి అంత మాట్లాడుకున్నారు. పైగా మనోడు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఇతను హిందీ యుట్యూబ్ ఛానెల్స్ లో తరచూ కామెడీ ఫిలిమ్స్ చేస్తుంటాడు. ఇతనికి బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకునేందుకు….

చాలా తక్కువ గ్యాప్ లోనే నవీన్ కు బాలీవుడ్ లోనూ ప్రూవ్ చేసుకునే అవకాశం దొరకడం విశేషం. అమీర్ ఖాన్ తో దంగల్ తీసిన నితీష్ తివారి రూపొందించిన చిచోరే వచ్చే నెల 6న విడుదల కానుంది. ఇందులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్నారు. ఇందులో నవీన్ ఆసిడ్ అనే హీరో స్నేహితుడి పాత్రను పోషించాడు. నిన్న రిలీజ్ అయినా ఈ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఇందులో నవీన్ పాత్ర చాలా కామెడీ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఈ పాత్ర క్లిక్ అయితే మాత్రం రచ్చ మాములుగా ఉండదు. నవీన్ ఈ సినిమాని ఆత్రేయ కన్నా ముందే ఒప్పుకున్నాడు. ఈసినిమాలో మనోడి పాత్ర క్లిక్ అయితే తెలుగు లో నవీన్ కి ఎక్కువ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Tags:    

Similar News