నవీన్ పోలిశెట్టి, షారుఖ్ ఖాన్ కొత్త రికార్డులు..

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, జవాన్ సినిమాలు నవీన్ అండ్ షారుఖ్ కి కొత్త రికార్డులు తెచ్చిపెట్టాయి.

Update: 2023-09-26 07:15 GMT

ఈ నెల (సెప్టెంబర్) 7న టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) 'జవాన్' మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ రెండు చిత్రాలు మొదటిరోజే హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూ ముందుకు సాగాయి. తాజాగా ఈ రెండు సినిమాలు నవీన్ అండ్ షారుఖ్ కి కొత్త రికార్డులు తెచ్చిపెట్టాయి.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ అయిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా అన్ని చోట్ల ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. తాజాగా రూ.50 కోట్ల మార్క్ ని అందుకుంది. 'జాతిరత్నాలు' తరువాత మళ్ళీ మరోసారి ఆ మార్క్ ని అందుకొని నవీన్ తన కెరీర్ లో ఒక రికార్డుగా రాసుకున్నాడు. అయితే ఈ మూవీ నవీన్ కి మరో రికార్డుని కూడా సొంతం చేయబోతుంది.
అమెరికాలో ఈ సినిమాకి బాగా ఆదరణ వస్తుంది. మొదటి మూడు రోజులోనే నవీన్ కి 1M మార్క్ ని అందించిన అక్కడ ఆడియన్స్.. ఇప్పుడు 2M మార్క్ ని కూడా సొంతం చేయబోతున్నారు. నవీన్ ఇప్పటి వరకు ఒక మిలియన్ మార్క్ ని మాత్రమే అందుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం రెండు మిలియన్స్ తెచ్చిపెడితే నవీన్ కి మరో రికార్డు సొంతం అయ్యినట్లు అవుతుంది.
ఇక జవాన్ విషయానికి వస్తే, ఫస్ట్ వీకెండ్ తోనే రూ.400 కోట్ల మార్క్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా 1000 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. షారుఖ్ గత సినిమా 'పఠాన్' కూడా ఈ మార్క్ ని అందుకుంది. కాగా ప్రభాస్, యశ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ సినిమాలతో ఒక్కరి మాత్రమే వెయ్యి కోట్ల క్లబ్ లో స్థానం దక్కించుకున్నారు. షారుఖ్ ఖాన్ కి ఈ క్లబ్ లో రెండు సినిమాలు ఉండడంతో ఇండియన్ మొదటి హీరోగా రికార్డు సృష్టించాడు.


Tags:    

Similar News