వైల్డ్ డాగ్ ని భారీ ధరకు కొన్న నెట్ ఫ్లిక్స్!

గత నెలలో నాగార్జున తాజా చిత్రం వైల్డ్ డాగ్ అందరిలాగే ఓటీటీకి అమ్మేశారని.. నెట్ ఫ్లిక్స్ నుండి నేరుగా వైల్డ్ డాగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని [more]

Update: 2021-01-02 17:06 GMT

గత నెలలో నాగార్జున తాజా చిత్రం వైల్డ్ డాగ్ అందరిలాగే ఓటీటీకి అమ్మేశారని.. నెట్ ఫ్లిక్స్ నుండి నేరుగా వైల్డ్ డాగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని అన్నారు. నెట్ ఫ్లిక్స్ భారీ అమౌంట్ కి నాగ్ వైల్డ్ డాగ్ డిజిటల్ రైట్స్ దక్కించుకుని నేరుగా ఓటిటి నుండి విడుదలకు సన్నాహాలు మొదలు పెట్టింది. అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ వాళ్ళు నాగార్జున వైల్డ్ డాగ్ కి పెట్టిన ధర చూస్తే నిజంగా దిమ్మతిరిగేలా ఉంది. నాగార్జున గత సినిమాలు అట్టర్ ప్లాప్ లిస్ట్ లో ఉన్నా వైల్డ్ డాగ్ మీదున్న క్రేజ్ వలనే నెట్ ఫ్లిక్క్ భారీ అమౌంట్ పెట్టి ఆ సినిమాని ఓటిటి లో విడుదల చేసేందుకు రెడీ అయ్యింది.

అయితే  వైల్డ్ డాగ్ వైల్డ్ డీల్ తో ఓటిటికి ఎంట్రీ ఇచ్చింది అని.. నెట్ ఫ్లిక్స్ నాగార్జున వైల్డ్ డాగ్ కోసం ఏకంగా 27 కోట్లు భారీ డీల్ సెట్ చెసుకుందనేది తాజా సమాచారం. 27 కోట్లకి వైల్డ్ డాగ్ ని కొనేసిన నెట్ ఫ్లిక్స్ ఆ సినిమాని ఈ నెల 26 న రిపబ్లిక్ డే రోజున అంటే జనవరి 26 న ఓటిటి నుండి విడుదలకు సన్నాహాలు చేస్తుంది అని.. త్వరలోనే వైల్డ్ డాగ్ ఓటిటి రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. 

Tags:    

Similar News