హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు.. కానీ!!

హీరోయిన్ నిత్యా మీనన్ ఎప్పుడు నటిని అవుతానని కానీ, అవ్వాలని కాని ఆనుకోలేదట. ఎప్పుడు చదువుపైనే ధ్యాస పెట్టేది. ఈ విషయం నిత్య మీనన్ చెబుతుంది. పాత్రకు [more]

Update: 2020-07-08 09:19 GMT

హీరోయిన్ నిత్యా మీనన్ ఎప్పుడు నటిని అవుతానని కానీ, అవ్వాలని కాని ఆనుకోలేదట. ఎప్పుడు చదువుపైనే ధ్యాస పెట్టేది. ఈ విషయం నిత్య మీనన్ చెబుతుంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించి గ్లామర్ తోనే కాదు.. నటనతోను కెరీర్ ని దున్నేయ్యొచ్చని నిరూపించిన నటి నిత్య మీనన్. అయితే తాజాగా తనకి సినిమాలోకి రావాలనే ఆశ లేదని చెబుతుంది. మీరు సినిమాల్లోకి ఎంటరైనప్పుడు ఎదుర్కున్న సవాళ్లేమిటి… ఎన్ని ఆడిషన్స్ లో మిమ్మల్ని రిజెక్ట్ చేసారు అని అడిగిన ప్రశ్నలకు.. నేను నటిని అవ్వాలని అనుకుంటే.. ఆడిషన్ కి వెళ్లాల్సి వచ్చేది. కానీ నా దృష్టి ఎప్పుడు చదువుపైనే ఉండేది. మాస్టర్స్ చెయ్యాలి. తర్వాత పిహెచ్ది చేసి విదేశాలకు వెళ్లిపోవాలని, అక్కడే సెటిలవ్వాలని ఉండేది.

కానీ నటిని అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. అయితే విధి రాత మార్చలేము కదా అంటుంది. నేను వద్దనుకున్నా సినిమా రంగం నన్ను ఆహ్వానించింది. నేను ఎలాంటి ఆడిషన్స్ కి, ఫ్యాషన్ షోలకి వెళ్లకుండానే నాకు అవకాశాలొచ్చాయి. అందుకే ఆడిషన్స్ లో రిజెక్ట్ అవడం కానీ, నన్ను వద్దనే వాళ్ళు కానీ లేరు. నా మనసుకు నచ్చిన కథలని ఎంపిక చేసుకుని సినిమాలు చేశాను. కాకపోతే నాలుగేళ్ళ వరకు నేను సినిమాలను అంత నటనను అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు నటనపై పూర్తి గ సీరియస్ గా దృష్టి పెట్టా అంటుంది నిత్య మీనన్.

Tags:    

Similar News