పవన్ సరసన కొత్తభామ?

పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా  చేస్తున్నాడు. అందులో అంజలి, నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోపక్క క్రిష్ సినిమాలో [more]

Update: 2020-05-13 09:13 GMT

పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. అందులో అంజలి, నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోపక్క క్రిష్ సినిమాలో పిరియాడికల్ డ్రామాగా మరో మూవీ చేస్తున్నాడు. ఆ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఫైనల్ అయినట్లుగా వార్తలొచ్చాయి. ఇక హారీష్ శంకర్ – పవన్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్డే పేరు, శృతి హాసన్ పేర్లు వినిపించాయి. హరీష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చెయ్యబోయే సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో.. ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ పై జనాల్లో ఆసక్తి పెరిగింది.

అయితే తాజాగా పవన్ – కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో ఓ కొత్తభామ నటించబోతుందని టాక్ మొదలైంది. కేరళలో పుట్టి దుబాయ్ లో పెరిగిన మానస రాధాకృష్ణన్ ను పవన్ సరసన హీరోయిన్ గా ఎంపిక చేసినట్టుగా టాక్. ఇప్పటికే పది మలయాళ మూవీస్ లో నటించిన మానస రాధాకృష్ణన్ పవన్ కళ్యాణ్ సరసన చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం మానస రాధాకృష్ణన్ మలయాళంలో పరమరుగు సినిమాలో నటిస్తుంది.

Tags:    

Similar News