Singham Again: తెలుగు సినిమాల రికార్డులను బద్దలు కొట్టే బాలీవుడ్ సినిమా అదేనా?
సింగం ఎగైన్ థియేట్రికల్ రిలీజ్‌కి ముందే రూ.200 కోట్లు
తెలుగు సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లు సృష్టించిన రికార్డు కలెక్షన్స్ ను బ్రేక్ చేయడానికి ఎన్నో సినిమాలు ప్రయత్నించాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ నుండి వస్తున్న మెగా సినిమా 'సింగం అగైన్'. మాస్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అందరూ ఉన్నారు.
సింఘం ఎగైన్ మేకర్స్ మాస్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇందులో నటులు అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకొనే, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, రణవీర్ సింగ్ ఉన్నారు. సినీప్రియులకు దీపావళి రోజున మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది. అజయ్ దేవగన్ తన భార్యని రక్షించే లక్ష్యంలో చేసే ఆపరేషన్ ను ఈ సినిమాలో చూపించారు. రామాయణం స్ఫూర్తిని తీసుకుని ఈ సినిమాను తీశారు. రాముడికి సహాయం చేసే లక్ష్మణుడు, ఆంజనేయుడు, జటాయువు పాత్రల్లో మిగిలిన స్టార్స్ నటించారు. దీపికా పదుకొణె లేడీ సింగమ్‌గా సింగం సిరీస్ లో అడుగుపెట్టింది. ఇన్‌స్పెక్టర్ సంగ్రామ్ భలేరావ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్. అక్షయ్ కుమార్ వీర్ సూర్యవంశీగా కనిపించనున్నాడు. టైగర్ ష్రాఫ్ ACP సత్యగా కనిపించనున్నాడు. ఇంతమంది స్టార్స్ ఉన్న ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ ను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
సింగం ఎగైన్ థియేట్రికల్ రిలీజ్‌కి ముందే రూ.200 కోట్లు రాబట్టిందని గతంలోనే వార్తలు వచ్చాయి. సింగమ్ ఎగైన్ శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్ హక్కులను కలిపి రూ. 200 కోట్లకు ఇప్పటికే విక్రయించారని తెలుస్తోంది. సింఘం ఎగైన్ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అది కాస్తా వాయిదా పడింది. ఇప్పుడు దీపావళి కానుకగా నవంబర్ 1న సినిమా హాళ్లలోకి రానుంది. కార్తిక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలు పోషించిన 'భూల్ భూలయ్యా 3'తో సింగం అగైన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.