Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్యకు మరో షాక్
నటుడు అక్కినేని నాగ చైతన్య అధికారిక అకౌంట్;

NagaChaitanya
నటుడు అక్కినేని నాగ చైతన్య అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. నాగ చైతన్య X ఖాతా నుండి హ్యాకర్లు క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ బహుమతికి సంబంధించిన ఒక ట్వీట్‌ను పోస్ట్ చేశారు. "నేను 2013లో 50$తో 100 BTCని కొనుగోలు చేసాను, వాటి విలువ ఇప్పుడు $6 మిలియన్లు. బహుమతి ఇవ్వడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఓటు వేయండి" అని నాగ చైతన్య అకౌంట్ నుండి వచ్చింది. అయితే ఆ ట్వీట్ తర్వాత తొలగించారు.
తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసుకు సంబంధించి నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రికి వ్యతిరేకంగా తన వాంగ్మూలాలను రికార్డ్ చేయడానికి నటుడు హాజరయ్యారు. ఆయన వెంట ఆయన భార్య అమల అక్కినేని, నాగ చైతన్య, సుప్రియ యార్లగడ్డ వచ్చారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలు తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయని నాగార్జున తన పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు. మీడియా ముందు మంత్రి చేసిన వ్యాఖ్యలు అసత్యం, అభ్యంతరకరమైనవి, రాజకీయ ప్రేరేపితమైనవి అని ఆయన తెలిపారు.