Stree 2: ఆమె జడలో పవర్స్.. ఆడవారిని ఎత్తుకుని వెళ్లే మాంత్రికుడు.. చివరికి ఏమయ్యారు?

సినిమా భారీ హిట్ అవ్వడం బాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి ఊపు;

Update: 2024-10-10 14:53 GMT
Stree2, ShraddhaKapoor, Stree2Movie, Stree,  PrimeVideo latest movies Stree 2 movie on OTT after record-breaking

Stree 2 movie on OTT

  • whatsapp icon

'స్త్రీ 2' సినిమా భారీ హిట్ అవ్వడం బాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి ఊపు ఇచ్చింది. ఈ హిట్ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్-బ్రేకింగ్ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా OTT విడుదలకు సిద్ధమైంది. ఆగస్ట్ 15, 2024న థియేట్రికల్ రన్ మొదలైన తర్వాత ఈ చిత్రం అనేక బాక్సాఫీస్ మైలురాళ్లను అధిగమించింది. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా రూ. 620 కోట్ల కలెక్షన్స్ ను కూడా ఈ సినిమా అధిగమించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

థియేట్రికల్ రన్ తర్వాత, 'స్త్రీ 2' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రసారం అవ్వనుంది. ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ కీలక పాత్ర పోషించగా రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా కీలక పాత్రల్లో నటించారు. తమన్నా భాటియా కూడా సినిమాలో కీలక పాత్ర పోషించింది.
2018లో వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. చందేరీ టౌన్ లో దెయ్యాలకు భయపడుతూ ఉంటారు. స్త్రీ వచ్చి ఏమైనా చేస్తుందేమో అనే టెన్షన్ అందరిలో ఉంటుంది. అయితే స్త్రీ మంచిదని తెలుసుకుంటారు. కానీ స్త్రీ 2 లో ఓ తల మాత్రమే ఉన్న రాక్షసుడు అక్కడి ఆడవాళ్లను ఏమి చేశాడన్నది మిగిలిన కథ. చందేరి పురాణంలో చిరిగిపోయిన పేజీల్లో ఏ రహస్యం దాగి ఉందన్నది కూడా సినిమాలో చూడాలి.


Tags:    

Similar News