కరొనకి భయపడని మెగా ఫ్యామిలీ!!

మెగా ఫ్యామిలీ హీరోలంతా కరొనకి భయపడి షూటింగ్స్ కి హాజరవడం లేదు. కేవలం మెగా హీరోలే కాదు.. ఏ హీరో కూడా షూటింగ్ స్పాట్ కి వెళ్లే [more]

Update: 2020-08-14 05:52 GMT

మెగా ఫ్యామిలీ హీరోలంతా కరొనకి భయపడి షూటింగ్స్ కి హాజరవడం లేదు. కేవలం మెగా హీరోలే కాదు.. ఏ హీరో కూడా షూటింగ్ స్పాట్ కి వెళ్లే ధైర్యం చెయ్యడం లేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ కరొనకి పెద్దగా భయపడడం లేదనిపిస్తుంది. కారణం టాలీవుడ్ లోని బడా ఫ్యామిలీ పెళ్లిళ్లు కరోనా టైం లోనే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే నిఖిల్ నితిన్, రానా లు పెళ్లిళ్లు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్యలోనే అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లిళ్లు జరిగాయి. రానా పెళ్ళిలో సమంత – చైతు ల అల్లరి, దగ్గుబాటి ఫామిలీ ఫోటో షూట్ అన్ని హైలెట్ అనేలా ఉన్నాయి. తాజాగా మెగా ఫ్యామిలి పెళ్లి సందడి మొదలయ్యింది. మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ధం ఈరోజు రాత్రి ఎలాంటి చడీ చప్పుడు లేకుండా సైలెంట్ గా జరిగిపోయింది. అసలు మీడియాకి విషయం లీక్ కాకుండా నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్దాన్ని గప్ చుప్ గా ఫామిలీ మెంబెర్స్ మధ్యన జరిగిపోయింది.

మెగా ఫ్యామిలీ అంటే ఎంత పెద్ద ఫ్యామిలినో చెప్పక్కర్లేదు. చిరు దంపతులు, చరణ్ దంపతులు, అల్లు ఫ్యామిలీ, కొణిదెల ఆడపడుచులు ఇలా చాలామంది ఉంటారు. నిహారిక నిశ్చితార్థంలో వాళ్ళందరూ ఉన్నారు. చిరు, సురేఖ, రామ్ చరణ్ – ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ, శ్రీజ, సుశ్మిత, వైష్ణవ తేజ్ ఇలా ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం నిహారిక – చైతన్య జొన్నలగడ్డ ఎంగేజ్మెంట్ లో సందడి చేసారు. కొద్దిమంది అతిదులనే పిలిచి నాగబాబు ఇలా సైలెంట్ గా నిశ్చతార్ధం చేసినా నిహారిక ఎంగేజ్మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలోకి లీక్ అయ్యాయి. నిహారిక మోహంలో పెళ్లికళ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంటే చిరు నాగబాబు లు చాలా హ్యాపీ గ కనబడుతున్నారు. మరి కరొనకి భయపడకుండా మెగా ఫ్యామిలీ మొత్తం మెగా డాటర్ నిశ్చితార్ధ వేడుకని గ్రాండ్ గా కంప్లీట్ చేసారు.

Tags:    

Similar News