నిహారిక-చైతన్య లకు విడాకుల ప్రక్రియ పూర్తయిందా ?

తన భర్త నుంచి విడాకులు కావాలని నిహారిక కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులకు కొన్నాళ్ల

Update: 2023-07-04 14:53 GMT

niharika chaitanya divorce

మెగా డాటర్ నిహారిక.. భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు పొందేందుకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కొంతకాలంగా వీరిద్దరూ విడిపోతున్నారన్న ప్రచారానికి ఈ దరఖాస్తుతో సమాధానం లభించింది. నిహారిక - చైతన్య కలిసి ఉండటం లేదని మెగా అభిమానులు ఎన్నో సందర్భాల్లో నిహారికను ప్రశ్నించారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లోనూ నిహారికను ఈ ప్రశ్న అడుగగా అందుకు సమాధానం చెప్పకుండా దాటవేసింది నిహారిక. ఇక ఇద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం, పెళ్లి ఫొటోలు, ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేయడం విడాకుల అనుమానాలకు తావిచ్చాయి. ఇటీవల జరిగిన వరుణ్ - లావణ్య ల ఎంగేజ్ మెంట్ లో కూడా చైతన్య కనిపించలేదు. కానీ.. ఎక్కడా వీరు తమ విడాకులపై స్పందించలేదు.

తన భర్త నుంచి విడాకులు కావాలని నిహారిక కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులకు కొన్నాళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. నేడు ఈ దరఖాస్తుపై విచారణ చేసిన కోర్టు ఇద్దరికీ అధికారికంగా విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో నాగబాబు కుమార్తె నిహారిక - ఐపీఎస్ అధికారి ప్రభాకర్ కొడుకు, టెకీ చైతన్య జొన్నలగడ్డల వివాహం ఘనంగా జరిగింది.
పెళ్లి తర్వాత వీరిద్దరూ కొంతకాలమే కలిసి ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత చైతన్యకు సంబంధించిన ఓ ఆఫీస్ పై దాడులు జరగడం, ఒక పబ్ లో జరిపిన దాడుల్లో నిహారిక డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం వీరిద్దరి మధ్య మనస్ఫర్థలకు కారణమైనట్లు తెలుస్తోంది. పబ్ విషయం తర్వాత నిహారికను చైతన్య ఫ్యామిలీ ఎక్కడికీ వెళ్లకుండా కట్టడి చేసిందని, చైతన్య తాను చెప్పిందే వినాలని కండీషన్స్ పెట్టారని అవన్నీ భరించలేక నిహారిక భర్తకు దూరంగా ఉంటోందని కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. తాజాగా విడాకులకు దరఖాస్తు చేసుకున్న పేపర్ బయటికి రావడంతో.. వీరిద్దరి విడిపోతున్నారన్న వార్తలు నిజమయ్యాయ. అయితే ఎందుకు విడిపోతున్నారన్న ప్రశ్న ప్రశ్నార్థకంగానే మిగిలింది.


Tags:    

Similar News