నిహారిక పెళ్లి సంబరాలు.. ఆకాశాన్ని తాకుతున్నాయి!
నాగబాబు కూతురు నిహారిక పెళ్లి మరో రెండు రోజుల్లో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరగబోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయపూర్ కి పయనమైంది. మెగాస్టార్ [more]
నాగబాబు కూతురు నిహారిక పెళ్లి మరో రెండు రోజుల్లో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరగబోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయపూర్ కి పయనమైంది. మెగాస్టార్ [more]
నాగబాబు కూతురు నిహారిక పెళ్లి మరో రెండు రోజుల్లో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరగబోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయపూర్ కి పయనమైంది. మెగాస్టార్ చిరు అండ్ చరణ్ తప్ప మిగతా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ లోనే సందడి చేస్తుంది. చిరు ఆచార్య షూటింగ్ లోను, రామ్ చరణ్ మహాబలేశ్వర్ లో RRR షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ లో నిహారిక వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. నిహారిక మంగళ స్నానం ఫొటోస్ ఇప్పడు నట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. నిహారిక పెళ్లి కి సంబందించిన వేడుకలు మెహిందీ, పెళ్లి కూతురు ఫంక్షన్, సంగీత్ ఫంక్షన్స్ లో మెగా ఫ్యామిలీ సందడి మాములుగా లేదు. చిరు కూతుళ్లు శ్రీజ, సుస్మితలు భర్తలతో కలిసి చెల్లి పెళ్ళికి హడావిడి చేస్తున్నారు.
నిహారిక వెడ్డింగ్ ఫంక్షన్స్ డ్రెస్సులైతే రిచ్ లుక్ ని తలపిస్తున్నాయి. నిహారిక రోజుకో డిజైనర్ డ్రెస్సుతో మెరిసిపోతుంది. తాజాగా నిహారికకి పెళ్లి కళ కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. చిలకపచ్చ చీరలో నిహారిక అందంగా ముస్తాబై.. పెళ్లి కూతురిలా వెలిగిపోతుంది. నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న నిహారిక రోజూ వేస్తున్న గెటప్స్ అన్ని పెళ్లి కూతురు గెటప్స్ ని తలపిస్తున్నాయి. చిలకపచ్చ చీరలో బంగారు ఆభరణాల మధ్యన, సిగ్గు పడుతూ.. కూర్చున్న నిహారికాని ఇప్పుడు ఈ టైం లో ఆమెకి కాబోయే భర్త చైతన్య వడ్లమూడి చూస్తే మైమరిచిపోవడం ఖాయం. మరి నిహారిక మంగళ స్నానాల ఫొటోస్ ఆమె పెళ్లి కూతురు గెటప్ ఫొటోస్ అన్ని నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.