నిహారిక పెళ్లి కానుకల విలువ ఎంతో తెలుసా!
మెగా కుటుంబం పెళ్లి రాజస్థాన్ లో మొదలై హైదెరాబాదులో ముగియబోతుంది. నిహారిక – చై పెళ్లి రాజస్థాన్ లో.. హైదెరాబాదులో రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరగబోతుంది. స్పెషల్ [more]
మెగా కుటుంబం పెళ్లి రాజస్థాన్ లో మొదలై హైదెరాబాదులో ముగియబోతుంది. నిహారిక – చై పెళ్లి రాజస్థాన్ లో.. హైదెరాబాదులో రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరగబోతుంది. స్పెషల్ [more]
మెగా కుటుంబం పెళ్లి రాజస్థాన్ లో మొదలై హైదెరాబాదులో ముగియబోతుంది. నిహారిక – చై పెళ్లి రాజస్థాన్ లో.. హైదెరాబాదులో రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరగబోతుంది. స్పెషల్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఈ పెళ్ళిలో స్పెషల్ గా కనిపించగా, అల్లు అర్జున్ అండ్ వైఫ్ స్నేహ, రామ్ చరణ్ అండ్ ఉపాసన క్యూట్ ఫొటోస్ పెళ్లి ఫొటోస్ కె హైలెట్ అనేలా ఉన్నాయి. నూతన వధూవరులు నిహారిక – చైతన్య ల ప్రతి మూమెంట్ ని ఫోటో గ్రాఫేర్స్ కెమెరాలో బంధించారు. పెళ్లి, పసుపు, మెహిందీ, సంగీత్ అబ్బో నిహారిక పెళ్లి చాలా వైభవంగానే జరిపించాడు నాగబాబు. ఇప్పుడు నిహారిక పెళ్లి ఖర్చు ఎంతవుతుందో అనేదానికన్నా నిహారిక వచ్చిన గిఫ్ట్స్ మీద ముచ్చట సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.
మరి పెళ్లి ఎంత వైభవంగా జరిగింది కాదిక్కడ .. నిహారికకు వచ్చిన బహుమతులు విలువెంతుంటుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియా ఫాన్స్ ఆరాలు మొదలు పెట్టారు. నిహారిక పెళ్లికి బహుమతులు కోట్లలో వచ్చినట్టుగా సోషల్ మీడియా టాక్. చిరు అయితే ఏకంగా మెగా డాటర్ నిహారికకు ఆమెకి నచ్చిన, నిహారిక సెలెక్ట్ చేసుకున్న కోట్లు విలువ చేసే ఆభరణాలు బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు. మరోపక్క మెగా ఫామిలీస్ మొత్తం అంటే అల్లు అరవింద్, పవన్, చిరు, సాయి ధరమ్ ఫ్యామిలీస్ అన్ని కలిసి నిహారికకు కోట్లు విలువ చేసే బహుమతులు ఇచ్చారని.. ఆ కోట్లు ఎంత అంటే ఐదు కోట్ల మేర నిహారికకు పెళ్లి బహుమతులుగా వచ్చాయని.. పెళ్లి ఖర్చు కన్నా బహుమతుల విలువే ఎక్కువ ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. మరి ఐదు కోట్ల బహుమతులు అంటే మెగా ఫ్యామిలీకి చాలా తక్కువే. కానీ చూసేవాళ్లకు అది మాములు విషయం కాదు.