నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఎందుకు చేసుకుందో తెలుసా!

మెగా డాటర్ నిహారిక – చైతన్య పెళ్లి వేడుకలు రాజస్థాన్ లో ఘనంగా ముగిసాయి. హైదెరాబా డ్లోనూ నిస్చెయ్ రిసెప్షన్ ని గ్రాండ్ గానే చేసారు.  అయితే [more]

Update: 2020-12-15 08:33 GMT

మెగా డాటర్ నిహారిక – చైతన్య పెళ్లి వేడుకలు రాజస్థాన్ లో ఘనంగా ముగిసాయి. హైదెరాబా డ్లోనూ నిస్చెయ్ రిసెప్షన్ ని గ్రాండ్ గానే చేసారు.  అయితే నిహారిక అసలు డెస్టినేషన్ వెడ్డింగ్ ఎందుకు చేసుకోవాలనుకుంది.. నాగబాబు ఆ వెడ్డింగ్ కి ఎందుకు ఓకె చెప్పాడో నాగబాబు మాటల్లోనే విందాం. నిహారిక పెళ్లి వేడుకలు ముగియడంతో కాస్త ఫ్రీ అయినా నాగబాబు నిహారిక పెళ్లి గురించి ఓ వీడియో షేర్ చేసాడు. అందులో నాగబాబు నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో చెప్పాడు. పెళ్లి అంటే బందు మిత్రుల ఆహ్వానాలు, వారికి అతిధి మర్యాదలు, ఇంకా పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడం అంటే మాములు విషయం కాదు. అందులోనూ ఇది కరోనా టైం కూడా. నాగబాబు నిహారిక పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ గా చెయ్యడానికి కరోనా కారణం ఒకటైతే.. మరోకటి పెళ్లి ని ఎంజాయ్ చెయ్యడం కోసమే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంచుకున్నామని చెబుతున్నాడు.

గతంలో మెగా ఫ్యామిలి జరిగిన బన్నీ, చెర్రీ  పెళ్లిళ్లు హైదరాబాద్ లో చెయ్యడం వలన వచ్చిన గెస్ట్ ల మర్యాదలు, పెళ్లి ఏర్పాట్లతో అసలు ఎంజాయ్ చేయలేకపోయామని, పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయి అలిసిపోయామని, కాబట్టి ఎంజాయ్ చేయలేకపోయామని.. కానీ నిహారిక పెళ్లి లో కరోనా కారణంగా పెద్దగా ఎవరిని పిలవలేదు కాబట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుని మా మెగా ఫామిలీస్ అన్ని కలిసి ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేశామంటున్నాడు నాగబాబు. నిహారిక పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఎలాంటి హడావిడి లేకుండా బాగా ఎంజాయ్ చేశామని అంటున్నాడు. అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నాము. నిహారిక – చైతన్య ఇష్టప్రకారమే ఈ వెడ్డింగ్ ని ప్లాన్ చేసాము. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ పనులన్నీ వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకున్నాడంటూ నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లి రాజస్థాన్ లో ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. 

Tags:    

Similar News