నిహారిక కాబోయే వాడు!!

మెగా ఫ్యామిలీ నుండు రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి చిత్రాలు విడుదలవుతున్నప్పుడు సోషల్ ఇండియాలో ఎంత హడావిడి ఉంటుంది.. తాజాగా మెగా డాటర్ [more]

Update: 2020-06-19 09:44 GMT

మెగా ఫ్యామిలీ నుండు రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి చిత్రాలు విడుదలవుతున్నప్పుడు సోషల్ ఇండియాలో ఎంత హడావిడి ఉంటుంది.. తాజాగా మెగా డాటర్ నిహారిక పెళ్లి కబుర్ల విషయంలోనూ అంతే హడావిడి కనబడుతుంది. నాగబాబు వచ్చే ఏడాది నిహారిక పెళ్లి అన్నాడు.. కానీ నిహారిక నిన్న సోషల్ మీడియాలో తనకు కాబోయే వాడిని చూపించకుండా అందరిని సస్పెన్స్ లో పడేసింది. నిహారిక ఓ గుంటూరు పోలీస్ అధికారి కొడుకు చైతన్య ని విహమాడబోతున్నట్టుగా నిన్న సోషల్ మీడియా అంత హల్చల్ చేసిన న్యూస్.

తాజా నిహారిక కాబోయే భర్త ఫోటోని రివీల్ చేసింది. గుంటూరు శ్రేణి ఐజి జోన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు…. జోన్నలగడ్డ వెంకట చైతన్య ని నిహారిక వివాహమాడబోతుంది. వెంకట చైతన్య తన ఇంజనీరింగ్ ని బిట్స్ పినాలిలో చేసి ప్రస్తుతం కాగ్నిజెంట్ వద్ద టెక్కీగా పనిచేస్తున్నాడు. నిహారికా మరియు వెంకట చైతన్యల నిశ్చితార్థ కార్యక్రమం ఆగస్టు 13 న జరుగుతుందని… ఈ ఏడాది చివర్లో వారి పెళ్లి జరగబోతున్నట్టుగా టాక్. నిహారిక కి కాబోయే భర్త చైతన్య అందంగానూ, ఆరడుగుల ఆజానుబాహుడుగాను, పర్ఫెక్ట్ హ్యాండ్ సమ్ గాను కనబడుతున్నాడు. నిహారిక కాబోయే భర్త చైతన్య తో చేయించుకున్న ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నిహారిక కి చైతన్య మంచి జోడి అంటూ మెగా ఫాన్స్ మురిసిపోతున్నారు.

Tags:    

Similar News