తమ్ముడు ముంచాడు.. మరి అన్న..?

జంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్ కి దూసుకొచ్చిన క్యూట్ హీరోయిన్ నివేదా థామస్. ఆ సినిమాతో హిట్ కొట్టడంతో ఆమె ఎక్కడికో వెళుతుంది అనుకున్నారు. అద్భుతమైన నటనతో నివేదా [more]

Update: 2019-03-01 07:21 GMT

జంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్ కి దూసుకొచ్చిన క్యూట్ హీరోయిన్ నివేదా థామస్. ఆ సినిమాతో హిట్ కొట్టడంతో ఆమె ఎక్కడికో వెళుతుంది అనుకున్నారు. అద్భుతమైన నటనతో నివేదా థామస్ అబ్బుర పరిచింది. జంటిల్మెన్ లో నానికి ఎంతగా మార్కులు పడ్డాయో నివేతకి అన్ని మార్కులు పడ్డాయి. నిన్నుకోరి సినిమాలోనూ అదిరిపోయే నటనతో అదరగొట్టేసింది. నానికి లవర్ గా, ఆది పినిశెట్టికి భార్యగా నివేత నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే మీడియం రేంజ్ హీరోలతో నటిస్తూ.. టాప్ లేవల్లోకి వెళ్లాల్సింది పోయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన చిన్నపాటి రోల్ దొరికేసరికి ఓకే చెప్పేసింది.

జై లవ కుశ హిట్ అయినా…

ఎన్టీఆర్ జై లవ కుశ సినిమాలో నివేత ఒక హీరోయిన్ గా నటించింది. నివేత ఆ సినిమాలో పెద్దగా ఇంపార్టెంట్ రోల్ మాత్రం చెయ్యలేదు. జై లవ కుశలో సెకండ్ హాఫ్ లో నివేత క్యారెక్టర్ కనిపిస్తుంది. కాస్త గ్లామర్ గా కనిపించినప్పటికీ.. ఎన్టీఆర్ సరసన నివేత తేలిపోయింది. ఇక జై లవ్ కుశ సినిమా హిట్లో కేవలం ఒక్క ఎన్టీఆర్ కి తప్ప మరే ఇతర క్యారెక్టర్ కి కానీ, దర్శకుడికి కానీ పేరు రాలేదు. ఇక జై లవ కుశ దెబ్బకి నివేత టాలీవుడ్ నుండి మాయమై మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తో 118 అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

118తో అయినా హిట్ వస్తుందా..?

కళ్యాణ్ రామ్ – నివేత థామస్ – షాలిని పాండే కలిసి నటించిన 118 ఇవాళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కథ మొత్తం నివేత థామస్ చుట్టూనే తిరుగుతుందని 118 ట్రైలర్ లోనే తెలిసింది. ఇక షాలిని పాండే కళ్యాణ్ రామ్ కి ఫియాన్సీ క్యారెక్టర్ లో కనిపిస్తుంటే.. సినిమా కథలో నివేత కీలకం అంటున్నారు. మరి తమ్ముడు ఎన్టీఆర్ జై లవ కుశతో ముంచేస్తే.. అన్న కళ్యాణ్ రామ్ 118తో ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

Tags:    

Similar News