చరణ్ రెడీ.. కానీ ఎన్టీఆర్?
చాలామంది హీరోలు కరోనా ఉంటే మాకేంటి.. షూటింగ్స్ కి అనుమతులొచ్చాయిగా అంటూ తమ సినిమాల్తో సెట్స్ మీదకెళుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటైన కెజిఎఫ్ చాప్టర్ 2 [more]
చాలామంది హీరోలు కరోనా ఉంటే మాకేంటి.. షూటింగ్స్ కి అనుమతులొచ్చాయిగా అంటూ తమ సినిమాల్తో సెట్స్ మీదకెళుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటైన కెజిఎఫ్ చాప్టర్ 2 [more]
చాలామంది హీరోలు కరోనా ఉంటే మాకేంటి.. షూటింగ్స్ కి అనుమతులొచ్చాయిగా అంటూ తమ సినిమాల్తో సెట్స్ మీదకెళుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటైన కెజిఎఫ్ చాప్టర్ 2 ఎప్పుడో పట్టాలెక్కేసింది. ఇక మరో భారీ బడ్జెట్ మూవీ RRR ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని హీరోల ఫ్యాన్స్ వెయిటింగ్. రాజమౌళి కానీ, రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ RRR షూటింగ్ విషయంలో ఓ స్పష్టతకు రాలేకపోతున్నారు. RRR షూటింగ్ మొదలైన వారానికే ఎన్టీఆర్ కొమరం భీం లుక్ వదులుతామని రాజమౌళి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాటిచ్చాడు కూడా. దానితో RRR షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ హీరోలే ముందుకు రాకపోతే.. రాజమౌళి మాత్రం ఏం చేస్తాడు.
అయితే తాజాగా రామ్ చరణ్ షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ లేటెస్ట్ గా జిమ్ లో దర్శనమిచ్చాడు. జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో రామ్ చరణ్ మల్లి వర్కౌట్స్ మొదలెట్టాడు. RRR లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ మాంచి 6 ప్యాక్ బాడీ తో కనబడుతున్నాడు. ఇప్పటికే అల్లూరి రామ్ చరణ్ టీజర్ విపరీతంగా పాపులర్ అయ్యింది . మరి రామ్ చరణ్ మరోపక్క RRR కన్నా ముందుగా ఆచార్య ఫినిష్ చెయ్యాలని చూస్తున్నాడని… అంటే ముందు ఆచార్య షూటింగ్ లో పాల్గొని తర్వాత RRR కి జాయిన్ అవుతాడని తెలుస్తుంది. మరోపక్క ఎన్టీఆర్ నో సౌండ్, ఇంతవరకు ఎన్టీఆర్ షూటింగ్ విషయాలు కానీ, ఎన్టీఆర్ వర్కౌట్స్ విషయాలు కానీ మీడియా కి దొరకడం లేదు. మరి చరణ్ రెడీ అంటుంటే.. ఎన్టీఆర్ ఇలా కామ్ గా ఉండడం ఆయన ఫ్యాన్స్ కి నచ్చడం లేదు.