పవన్ విషయం తేల్చని రాజుగారు?

పవన్ కళ్యాణ్ ని రాజకీయాల నుండి పట్టుబట్టి సినిమాల్లోకి తీస్కోచ్చాడు నిర్మాత దిల్ రాజు. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలనే కలని పింక్ రీమేక్ తో [more]

Update: 2020-10-28 04:13 GMT

పవన్ కళ్యాణ్ ని రాజకీయాల నుండి పట్టుబట్టి సినిమాల్లోకి తీస్కోచ్చాడు నిర్మాత దిల్ రాజు. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలనే కలని పింక్ రీమేక్ తో తీర్చుకున్నాడు. అన్నీ సవ్యంగా జరిగితే పింక్ రీమేక్ వకీల్ సాబ్ మే లో విడుదలైపోయి రాజు గారి కోరిక తీర్చేసేదే. కానీ కరోనా దెబ్బకి దిల్ రాజు విల విలలాడాడు. అయితే ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ లుక్ చేంజ్ చేసుకుని ఓ 20 రోజుల షూటింగ్ చేస్తే వకీల్ సాబ్ కంప్లీట్ అవుతుంది. అయితే దసరా రోజున వకీల్ సాబ్ కొత్త పోస్టర్ కానీ.. కనీసం సినిమా విడుదల ఎప్పుడు అనే క్లారిటీ కానీ దిల్ రాజు ఇస్తాడేమో అని పవన్ ఫాన్స్ ఎదురు చూసారు.

కానీ వకీల్ సాబ్ ముచ్చట సోషల్ మీడియాలో కానరాలేదు. మరి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని దిల్ రాజు తనకి అచ్చి వచ్చినసంక్రాతి బరిలో నిలుపుతాడు.. వకీల్ సాబ్ ఖచ్చితంగా సంక్రాంతికే అంటూ ప్రచారం జోరుగా జరిగింది. మరి సంక్రాంతికి చాలా సినిమాలా విడుదల డేట్స్ లాక్ చేస్తున్నాయి. కానీ పవన్ విషయం రాజు గారు ఎటూ తేల్చలేదు. దసరాకి వకీల్ సాబ్ బిగ్ ఎనౌన్సమెంట్ ఇస్తే అదిరిపోయేది. కానీ దిల్ రాజు సైలెంట్ గా ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదా? అందుకే దిల్ రాజు సాహసించలేదా? పవన్ షూటింగ్ కి ఎప్పుడొస్తాడో.. అసలు వకీల్ సాబ్ సంక్రాంతికి అయినా రెడీ అవుతుందా.. లేదా.. అనేది దిల్ రాజుకి అర్ధం కాకనే ప్రకటన ఇవ్వలేదా? లేదంటే వకీల్ సాబ్ షూట్ లోకి పవన్ దిగగానే వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఇద్దామని ఆగాడా.. ఏదైనా పవన్ విషయం తేల్చకుండా రాజుగారు ఇలా నాన్చడం ఆయన అభిమానులకి మింగుడు పడడం లేదు.

Tags:    

Similar News