బిగ్ బాస్ కే ట్విస్ట్ ఇచ్చిన నోయెల్?

బిగ్ బాస్ సీజన్ 4 ప్రస్తుతం పది మంది కంటెస్టెంట్స్ మిగిలారు. నోయెల్ అనారోగ్య కారణాలతో హౌస్ నుండి వెళ్ళిపోయాడు. ఇరాక్ నాగార్జున వ్యాఖ్యాతగాఎనిమిది వారాలు దిగ్విజయంగా [more]

Update: 2020-11-02 08:33 GMT

బిగ్ బాస్ సీజన్ 4 ప్రస్తుతం పది మంది కంటెస్టెంట్స్ మిగిలారు. నోయెల్ అనారోగ్య కారణాలతో హౌస్ నుండి వెళ్ళిపోయాడు. ఇరాక్ నాగార్జున వ్యాఖ్యాతగాఎనిమిది వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని తొమ్మిదో వారంలోకి బిగ్ బాస్ శని నాగ్ క్లాస్, ఆదివారం ఫన్నీ గా గేమ్స్ ఆడడంతో పాటుగా. ఎలిమినేషన్స్ ప్రక్రియతో హౌస్ లొ అంతా ఎమోషన్ కనబడుతుంది. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ లో ఉన్న మోనాల్, లాస్య, అఖిల్, అరియనాలలో లాస్య, అఖిల్ లు శనివారం సేవ్ అవ్వగా.. ఆదివారం వచ్చేసరికి ముందు మోనాల్ సేవ్ అయితే.. తర్వాత అరియానని సేవ్ చేసారు.

ఇక చివరిగా బిగ్ బాస్ హౌస్ లో అమ్మ రాజశేఖర్ – మెహబూబ్ ఇద్దరు నామినేషన్స్ లో మిగలగా నాగార్జున వారిద్దని కన్ఫెషన్ రూమ్ లో కూర్చోబెట్టి.. హౌసెమెట్స్ అందరిని మీరు ఈ హౌస్ లో అమ్మ ఉండాలనుకుంటున్నారా? మెహబూబ్ ఉండాలనుకుంటున్నారా అని అడగగా.. హౌస్ మేట్స్ లో ఎక్కువశాతం మెహబూబ్ హౌస్ లో ఉండాలంటూ ఓట్స్ వేశారు. అమ్మ హౌస్ లో ఉండాలని అరియనా, అవినాష్ ఓట్స్ వేశారు. దానితో నాగార్జున అమ్మ రాజశేఖర్ ని బిగ్ బాస్ స్టేజ్ మీదకి పిలిచినట్టే పిలిచి ఎలిమినేట్ చెయ్యడం లేదని.. అమ్మ రాజశేఖర్ ని సేవ్ చేసి.. ఈవారం నో ఎలిమినేషన్స్ అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.

మరి అమ్మ రాజశేఖర్ ని సేవ్ చేసింది నాగ్ కానీ, బిగ్ బాస్ కానీ, ప్రేక్షకులు కానీ కాదు. అమ్మ రాజశేఖర్ ని సేవ్ చేసింది నోయెల్ అంటూ నాగార్జున ఆ ట్విస్ట్ రివీల్ చేసాడు. అంటే నోయెల్ నేను ఎలాగూ హౌస్ లో ఉండడం లేదుగా.. అందుకే ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చెయ్యొద్దూ అంటూ నాగ్ దగ్గర మాట తీసుకోవడంతో.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరూ బయటికి వెళ్ళలేదు. ఇక నాగార్జున అమ్మ రాజశేఖర్ ని డైరెక్ట్ గా వచ్చే వారం కెప్టెన్ ని చేసేసి బిగ్ బాస్ స్టేజ్ ని వీడాడు.

Tags:    

Similar News