కరోనా అంటే భయం లేదంటున్న బాలీవుడ్ స్టార్స్!!

కరోనా వలన అన్ని మూగబోయాయి. లాక్ డౌన్ తో ఎవరికీ వారు ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్యుడి దగ్గరనుండి సెలెబ్రిటీ వరకు అందరూ ఇంట్లోనే ఉన్నారు. కరోనా భయం [more]

Update: 2020-11-14 05:48 GMT

కరోనా వలన అన్ని మూగబోయాయి. లాక్ డౌన్ తో ఎవరికీ వారు ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్యుడి దగ్గరనుండి సెలెబ్రిటీ వరకు అందరూ ఇంట్లోనే ఉన్నారు. కరోనా భయం అలాంటిది. మార్చ్ నుండి ఆగష్టు వరకు కరోనా అంటే అందరూ కంగారు పడ్డారు. కానీ ఆగష్టు నుండి ప్రజలంతా ఎవరి పనులకి వారు వెళుతున్నారు. కొంతమంది అతి జాగ్రత్తలతో.. మరికొంతమంది అసలు ఎలాంటి జాగ్రత్త లేకుండా బయటికి వెళుతున్నారు. ఇక సినిమా సెలబ్రిటీస్ కూడా సెప్టెంబర్ నుండి సినిమా షూటింగ్స్ మొదలు పెట్టేసారు. అక్కడక్కడా కరోనా గురించి కంగారు పడుతున్నా.. అది పెద్ద విషయం కాదన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇక టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సినిమా షూటింగ్ కళకళలు కనిపిస్తున్నాయి.

అయితే పార్టీలు, ఫంక్షన్స్, పెళ్లిళ్ల విషయంలో సెలబ్రిటీస్ జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ.. కొంతమందికి ఈ పబ్లిక్ ఫంక్షన్స్ కి వెళ్లక తప్పడం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీస్ కరోనా అంటే ఐ డోంట్ కేర్ అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఏడాది బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇళ్లల్లో దీపావళి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడం అలాగే.. ఆ వేడుకలకి బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ అంత హాజరవడం చూస్తున్నాం. తాజాగా కరోనా టైం లో బాలీవుడ్ బడా నిర్మాత ఏక్తా కపూర్ ఇంట్లో దీపావళి సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరగడం దాని కోసం బాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తం మాస్క్ లు లేకుండానే హాజరవడం చూస్తుంటే కరోనా అంటే బాలీవుడ్ భయం వదిలేసింది అనుకోవచ్చేమో.

Tags:    

Similar News