ఆర్సీబీ వర్సెస్ జైలర్.. నెగ్గింది ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జెర్సీని షూటర్ ధరించిన

Update: 2023-08-29 01:47 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జెర్సీని షూటర్ ధరించిన దృశ్యాలను మార్చాలని ‘జైలర్’ చిత్ర నిర్మాతలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం, సెప్టెంబర్ 1వ తేదీలోగా ఈ సన్నివేశాలను మార్చాలి లేదా థియేటర్లలో RCB జెర్సీని ప్రదర్శించకూడదని తెలిపారు.

ఒక సీన్ లో కాంట్రాక్ట్ కిల్లర్.. RCB జెర్సీ వేసుకొని.. ముత్తు(రజినీ) కోడలిని అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ వస్తాడు. ఆ వ్యక్తి ఆర్సీబీ జట్టు డ్రెస్ ను వేసుకుని కనిపిస్తాడు. ఈ సంఘటన కారణంగా.. RCB జెర్సీని వారు అవమానించినట్లు చిత్రీకరించారని, వెంటనే ఆ సీన్ ను డిలీట్ చేయాలనీ RCB కోర్టులో కేసు వేసింది. ఇక ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు తీర్పును ఇచ్చింది. జెర్సీ ఉన్న సీన్ ను తొలగించాలని తెలుపుతూ జైలర్ మేకర్స్ కు ఉత్తర్వులు జారీ చేసింది.
సెప్టెంబర్ 1, 2023 నుండి థియేటర్లలో ఈ సీన్ లో ఆ వ్యక్తి ఆర్సీబీ డ్రెస్ వేసుకుని కనిపించడు. జైలర్ చిత్రం థియేటర్లలో RCB టీమ్ జెర్సీ మార్చాల్సి ఉంది. 1 సెప్టెంబర్, 2023 తర్వాత, ఏ థియేటర్‌లోనూ RCB జెర్సీని ఏ రూపంలోనూ ప్రదర్శించకూడదని కోర్టు తీర్పును ఇచ్చింది. టెలివిజన్, శాటిలైట్, ఏదైనా OTT ప్లాట్‌ఫారమ్‌ లో కూడా ఇదే తరహాలో మార్పు కనిపించాలని కోర్టు ఆదేశించింది. కించపరిచే విధంగా చిత్రీకరించబడిన దృశ్యాలలో RCB జెర్సీని ఉపయోగించడంపై ఆర్సీబీ యాజమాన్యం అభ్యంతరాలు లేవనెత్తింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీని సినిమాలో ప్రతికూలంగా చిత్రీకరించారని, జెర్సీని ఉపయోగించే ముందు జట్టు అనుమతి తీసుకోలేదని వాదించింది. తమ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరిగాయని RCB పేర్కొంది.


Tags:    

Similar News