మే బోసిపోతుంది

ఆఫ్టర్ కరోనా క్రైసిస్ థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఈ సంవత్సరం మళ్లీ సినిమా థియేటర్స్ కళకళలాడాయి. బాక్సాఫీసు దగ్గర కాసుల గలగలలు వినిపించాయి. జనవరి నుండి ఏప్రిల్ [more]

Update: 2021-05-03 17:29 GMT

ఆఫ్టర్ కరోనా క్రైసిస్ థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఈ సంవత్సరం మళ్లీ సినిమా థియేటర్స్ కళకళలాడాయి. బాక్సాఫీసు దగ్గర కాసుల గలగలలు వినిపించాయి. జనవరి నుండి ఏప్రిల్ దాకా నెలకో బ్లాక్ బస్టర్ చొప్పున థియేటర్స్ లో ప్రేక్షకులని కనువిందు చేసాయి. జనవరిలో రవితేజ క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా, ఫిబ్రవరిలో ఉప్పెన థియేటర్స్ లో ఉప్పొంగే హిట్ అయ్యింది. ఇక మార్చి లో జాతి రత్నాలు నవ్వుల బ్లాక్ బస్టర్ అందించింది. ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగు ఇండస్ట్రీ మళ్లీ కళకళలాడుతుంది అనుకున్న టైం లో కరోనా సెకండ్ వేవ్ మొదలైపోయింది.
లేదంటే మే నెలలో ఆచార్య, నారప్ప వంటి సినిమాలతో మళ్ళీ బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల సందడి కనిపించేది. లవ్ స్టోరీ, ఆచార్య, నారప్ప ఈ మూవీస్ కూడా రిలీజ్ అయితే ఆ కిక్కే వేరుగా ఉండేది. ఇక మే మొత్తం థియేటర్స్ క్లోజ్ అవ్వగా.. ఆచార్య, నారప్ప సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ లు అధికారికంగా ప్రకటించగా.. బాలయ్య అఖండ, రవితేజ ఖలాడి సినిమాల పోస్ట్ పోన్ విషయం ఇంకా సందిగ్ధంలోనే ఉన్నప్పటికీ.. మే లో థియేటర్స్ ఓపెన్ అయ్యి మళ్లీ సినిమాల విడుదల అంటే కష్టమే. ఇక మే లో థియేటర్స్ క్లోజ్ అయినా.. ఓటిటీలలో కొన్ని సినిమాలు డైరెక్ట్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News