దసరా పోయే.. సంక్రాంతికైనా?

ఎప్పుడూ దసరా కి సినిమాల హడావిడి మాములుగా ఉండేది కాదు. భారీ సినిమాల దగ్గరనుండి చిన్న చితక సినిమాల వరకు దసరా సెలవలని టార్గెట్ చేసేవి. ఏపీ, [more]

Update: 2020-09-17 06:29 GMT

ఎప్పుడూ దసరా కి సినిమాల హడావిడి మాములుగా ఉండేది కాదు. భారీ సినిమాల దగ్గరనుండి చిన్న చితక సినిమాల వరకు దసరా సెలవలని టార్గెట్ చేసేవి. ఏపీ, తెలంగాణ లలో దసరా సెలవలు ఎలా లేదన్నా 15 రోజులుంటాయి. పిల్లలు ఖాళీ కాబట్టి పేరెంట్స్ చచ్చినట్టుగా సినిమాకి వెళ్లాల్సిందే. అందుకే పెద్ద సినిమాలు ఎక్కువగా దసరనే టార్గెట్ చేస్తుంటాయి. కానీ ఈ దసరా మాత్రం కరోనా కాలంలో కొట్టుకుపోయింది. సినిమాలన్ని ఇప్పుడు దసరా పండగ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. థియేటర్స్ దసరాకి ఓపెన్ చేస్తారనే న్యూస్ ఉన్నప్పటికీ.. కరోనా తో ఎంతమంది థియేటర్స్ కి వస్తారో తెలియదు. అందులోనూ థియేటర్స్ ఓపెన్ చేసినా ఆక్యుపెన్సీ ఉండదు. కరోనా టైం లో థియేటర్స్ ని మాటిమాటికి శానిటైజ్ చేసి శుభ్రంగా ఉంచాలంటే తలకు మించిన భారం.

అందుకే ఇప్పుడు చాలామంది దర్శకనిర్మాతలు కరోనా టీకా వచ్చే వరకు ఆగలేనివారు తమ సినిమాలను ఓటిటికి బేరం పెడుతున్నారు. కానీ మా సినిమా ఎలాగైనా థియేటర్స్ లో విడుదల చేద్దామనుకునేవారు మాత్రం సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాయి. దసరా వదిలి వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీ ఉన్నా లెక్క చెయ్యం మేము మాత్రం థియేటర్స్ లో వస్తామంటున్నారు. ఎలాగూ డిసెంబర్ కల్లా కరోనా వ్యాక్సిన్ ఓ కొలిక్కి వస్తుంది. దానితో ప్రేక్షకులు భయం లేకుండా బయటకు వస్తారు. అందుకే దసరా ని పక్కనపడేసి ఇప్పుడు అందరూ సంక్రాంతే ముద్దుగా అంటున్నారు. సో వచ్చే సంక్రాతి సినిమాల హడావిడి మాత్రం ఓ రేంజ్ లోనే ఉండబోతుంది. ఇక సంక్రాతి బారి అనే మాట వింటున్నది మాత్రం నితిన్ రంగ్ దే, పవన్ వకీల్ సాబ్ , తమిళంలో విజయ్ మాస్టర్ సినిమాల్తో పాటు అప్పటికి మరెన్ని లిస్ట్ లోకోస్తాయో చూడాలి.

Tags:    

Similar News