నాకేం పట్టింపు లేదు.. థియేటర్స్ అయినా.. ఓటిటి అయినా?

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. గత రెండు నెలలుగా అన్ని బ్రేకులే. అయితే ప్రస్తుతం సినిమా థియేటర్స్ సంగతి అటుంచి.. [more]

Update: 2020-05-29 08:16 GMT

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. గత రెండు నెలలుగా అన్ని బ్రేకులే. అయితే ప్రస్తుతం సినిమా థియేటర్స్ సంగతి అటుంచి.. షూటింగ్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు అనుమతులునివ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే థియేటర్స్ ని కూడా ఒకేసారి దేశం మొత్తం ఓపెన్ చెయ్యాలని చూస్తుంది. కానీ అది ఎప్పుడో తెలియదు ఈలోపు సినెమాలను ఓఐటి లలో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాకపోతే నిర్మాతలు నష్టపోతున్నామని ఓటిటి కి టెంప్ట్ అవుతుంటే హీరో హీరోయిన్స్ మాత్రం ఓటిటి సమస్యే లేదు, థియేటర్స్ లోనే సినిమాలు విడుదలవ్వాలని పట్టుబడుతున్నారు.

కానీ తాజాగా రకుల్ ప్రీత్ మాత్రం సినిమా ఓటిటి లో విడుదలవ్వలా ? లేదంటే థియేటర్స్ లో విడుదలవ్వలా? అనేది నిర్మాతల ఇష్టం అని. వారే సినిమాని నిర్మించి బడ్జెట్ పెడతారు గనక అది వారిష్టం అంటుంది. సినిమా షూటింగ్స్ మొదలైనప్పటికీ… కరోనా వలన 100 మంది షూటింగ్స్ లో పాల్గొనాలంటే కుదరదని… ముందుముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలని అంటుంది. ఇక తాను నటించిన రెండు సినిమాలు షూటింగ్స్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్డమాయ్యాయని.. ఎటాక్ సినిమాతో పాటుగా అర్జున్ కపూర్ తో కలిసి నటించిన  సినిమా కూడా విడుదల కావాల్సి ఉందని…. ఇక సౌత్ లో ఓ సినిమా షూటింగ్ చెయ్యాల్సి ఉందని చెబుతుంది.

ఇక ఆయా ప్రదేశాల నిబంధనల్ని బట్టి డేట్స్ సర్దుబాటు చేసుకోవాలని చెబుతుంది. ఇక తన సినిమాలు ఏ ప్లేట్ ఫారం లో విడుదలైన తనకేమి అభ్యంతరం లేదని.. సూర్యవంశీ లాంటి సినిమాలు పెద్ద తెర మీద చూస్తేనే బావుంటుంది అని కానీ ఈ విషయంలో తుది నిర్ణయం నిర్మాతలదే అంటుంది. ఎందుకంటే నిర్మాతలు కష్టోడ్చి బడ్జెట్ పెడతారు. సినిమాకి ఎంత మొత్తం అవుతుంది.. అనేది న్రినిర్మతలకి తెలుసు. కనకనే వారు ఇప్పుడు ఓటీటీకి మొగ్గు చూపుతున్నారు. అయినా వారు థియేటర్ లో విడుదల చెయ్యాలా ఓటిటి లో విడుదల చెయ్యాలా అనేది బారి ఆలోచన బట్టి ఉంటుంది.. అయినా పరిస్థితులన్నీ చక్కబడి సినిమాలన్నీ థియేటర్స్ లోనే విడుదల కావాలని కోరుకుందామా అంటుంది.

Tags:    

Similar News