మా అమ్మ బయోపిక్ కి అనుమతి లేదు!!
మహానటి సావిత్రి బయోపిక్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో.. అందులో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కి అంతే పేరొచ్చింది. అయితే అదే కీర్తి సురేష్ [more]
మహానటి సావిత్రి బయోపిక్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో.. అందులో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కి అంతే పేరొచ్చింది. అయితే అదే కీర్తి సురేష్ [more]
మహానటి సావిత్రి బయోపిక్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో.. అందులో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కి అంతే పేరొచ్చింది. అయితే అదే కీర్తి సురేష్ మరో బయోపిక్ లో నటించబోతుంది అని… అది కూడా గిన్ని బుక్ లో కెక్కిన దర్శకనిర్మాత, సీనియర్ హీరోయిన్ విజయనిర్మల బయోపిక్ త్వరలోనే పట్టాలెక్కబోతుంది అంటూ సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతోంది. ఇక కరోనా లాక్ డౌన్ పూర్తి కాగానే విజయ్ నిర్మల బయోపిక్ పాటలెక్కబోతుందంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో విజయ్ నిర్మల కొడుకు సీనియర్ నరేష్ ఆ బయోపిక్ పై స్పందించాడు.
తన తల్లి బయోపిక్ విషయంలో తమని ఎవరూ సంప్రదించలేదని… విజయ్ నిర్మల బయోపిక్ కి ఎవరికీ అనుమతి లేదని చెబుతున్నాడు. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో తెలియదన్నారు. ఒక వ్యక్తి బయోపిక్ చెయ్యాలంటే కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. ఇక మా అమ్మ విజయనిర్మల బ్రతికుండగానే.. బయోపిక్ కథ రాస్తున్నా…. అమ్మ నన్ను స్క్రిప్ట్ రాయమంటే… నేను ఆ స్క్రిప్ట్ రాస్తున్నా.. కానీ, అమ్మ చనిపోవడంతో ఆ స్క్రిప్ట్ పనులు పక్కన పెట్టా.. ఇక అమ్మ బయోపిక్ సినిమా చెయ్యాలి అంటే.. చాలా పరిశోధన చెయ్యాలి. ఆమె గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం, 44 సినిమాలు తీసిన ఘనత అమ్మది.. అలాంటి అమ్మ మీద బయోపిక్ చెయ్యడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇక మీ అమ్మ బయోపిక్ మీరు డైరెక్ట్ చేస్తారా అన్న ప్రశ్నకు.. అది ఇప్పుడే చెప్పలేమంటూ సమాధానం