ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనుమతులు ఉండవేమో?

కరోనా సెకండ్ వెవ్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఇండియాలోనే కాదు.. అన్ని దేశాల్లో కరోనా సెకండ్ వెవ్ తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఇండియాలో వేలల్లో కేసులు [more]

Update: 2021-04-05 04:02 GMT

కరోనా సెకండ్ వెవ్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఇండియాలోనే కాదు.. అన్ని దేశాల్లో కరోనా సెకండ్ వెవ్ తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఇండియాలో వేలల్లో కేసులు నమోదు కావడం నిపుణులను ఆందోళనకు గురి చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలల్లో కరోనా సెకండ్ వెవ్ విలయ తాండవం, చెయ్యడమే కాదు.. పలువురు సెలెబ్రిటీస్ కరోనా బారిన పడుతున్నారు. జనవరి నుండి సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవడమే కాదు.. ఆ సినిమాల ఈవెంట్స్ కూడా అభిమానుల మధ్యన అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓపెన్ ఈవెంట్స్ అంటూ రాజమండ్రి, తిరుపతి, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ ఇలా అభిమానుల మధ్యన వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో.. లాక్ డౌన్ ప్రస్తావన రాకుండా ఇలాంటి ఓపెన్ ఈవెంట్స్ కి పోలీస్ లు అనుమతులు ఇవ్వడం లేదు. తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ పోలీస్ లు అనుమతులు నిరాకరించారు. ఓపెన్ గ్రౌండ్ లో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చెయ్యగా పోలీస్ లు అనుమతులు రాని కారణంగా శిల్పకళా వేదికలో ఈ రోజు సాయంత్రం వకీల్ సాబ్ ఈవెంట్ కానిచ్చేస్తున్నారు. మరి జాతి రత్నాలు, ఉప్పెన, చావు కబురు చల్లగా, రంగ్ దే, టక్ జగదీశ్ ఇవన్నీ అభిమానుల కోలాహలం మధ్యన జరిగాయి. కానీ ప్రస్తుతం కరోనా ఉధృతిలో ఇలాంటి ఓపెన్ ఈవెంట్స్ కి అనుమతులు లభించకపోవచ్చు. నిన్నటివరకు ఉత్సాహంగా ఉన్న సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు కరోనా బారిన పడడం కలవరం సృష్టిస్తుంది.

Tags:    

Similar News