రౌడీ హీరో కోసం ఫాన్స్ వెతుకులాట!

టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ జాతర ఓ యుద్ధంలా జరిగింది. ఫిబ్రవరి 12 న మెగా హీరో వైష్ణవ తేజ్ ఉప్పెన తో స్టార్ట్ అవుతున్న క్రేజీ [more]

Update: 2021-02-03 09:22 GMT

టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ జాతర ఓ యుద్ధంలా జరిగింది. ఫిబ్రవరి 12 న మెగా హీరో వైష్ణవ తేజ్ ఉప్పెన తో స్టార్ట్ అవుతున్న క్రేజీ మూవీస్ రెలీసెస్.. అక్టోబర్ 13 రాజమౌళి RRR వరకు ఓ జాతరలా జరగనుంది. మధ్యలో క్రేజీ మూవీస్, మీడియం, భారీ, చిన్న బడ్జెట్ సినిమాలు అన్ని తమ తమ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసి సోషల్ మీడియాని ఊపిరి పీల్చుకోకుండా చేసాయి. మధ్యలో ఫాన్స్ హంగామా. తమ అభిమాన హీరోల రిలీజ్ డేట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. మరి చిరు దగ్గరనుండి చిన్న చితక, స్టార్ హీరోలంతా తమ సినిమా రిలీజ్ డేట్స్ ని గ్రాండ్ గా ప్రకటించినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే నాగార్జున లు తమ సినిమాల విషయంలో సైలెంట్ గా ఉండిపోయారు.
పూరి జగన్నాధ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం లైగర్ రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఎప్పుడూ స్పీడుగా ఉండే పూరి ఇప్పుడు కామ్ గా సైలెంట్ గా ఉండడం రౌడీ ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందరి కన్నా ముందే రిలీజ్ డేట్ ఇస్తారనుకుని కలలు కన్న రౌడీ ఫాన్స్ కి విజయ్ దేవరకొండ హ్యాండ్ ఇచ్చాడు. మరోపక్క ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఇవ్వయ్యా బాబూ అంటే.. ప్రేమికుల రోజున రాధేశ్యామ్ టీజర్ అన్నాడు ప్రభాస్. మరోపక్క నాగార్జున వైల్డ్ డాగ్ విషయం తేల్చకుండా సస్పెన్స్ లో పెట్టాడు. మరి స్టార్ హీరోలంతా సినిమా రిలీజ్ డేట్స్, అలాగే కొత్త పోస్టర్స్ సోషల్ మీడియాలో చేసిన హంగామాలో విజయ్ దేవరకొండ, ప్రభాస్ అండ్ నాగ్ లు మాత్రం మిస్ అయ్యారు. 

Tags:    

Similar News